దక్షిణ కాశీగా ప్రసిద్ది చెందిన, శ్రీ కేతకి సంగమేశ్వర దేవాలయ నూతన కమిటీ చైర్మన్ గా ఎన్నికైన ఎ. చంద్రశేఖర్ పాటిల్ ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్న
★ జహీరాబాద్ ఎంపీ. సురేష్ కుమార్ షెట్కార్ గారు
★ మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ ఎ చంద్రశేఖర్ గారు
జహీరాబాద్. నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గంలోని ఝరాసంగం మండల కేంద్రంలో నెలకొన్న శ్రీ కేతకి సంగమేశ్వర దేవాలయ నూతన కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ పాటిల్ గారి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొని ఛైర్మెన్ మరియు కమిటీ సభ్యులు సత్కరించిన జహీరాబాద్ ఎంపీ. సురేష్ కుమార్ షెట్కార్, మరియు మాజీ మంత్రివర్యులు డాక్టర్ చంద్రశేఖర్.మరియు వారు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి ఎల్లవేళలా అండగ ఉండి పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం అని పేర్కొన్నారు.

అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి,ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా గ్రంథయాల చైర్మన్ అంజయ్య ,మాజీ జిల్లా పరిషత్ ఛైర్మెన్ సునీతా పాటిల్ , జహీరాబాద్ నియోజకవర్గ మండలాల అధ్యక్షులు హన్మంతరావు పాటిల్, శ్రీనివాస్ రెడ్డి, భాస్కర్ రెడ్డి,రామలింగారెడ్డి, కండేం నర్సింలు ,మాక్సూద్,నర్సాసింహ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆర్షద్ అలీ,మాజీ ఇండస్ట్రియల్ ఛైర్మెన్ తన్వీర్, మాజీ ఎంపిపి దేవదాస్ గారు,మాజీ ఎంపిటిసిలు అశోక్ ,శంకర్ పాటిల్,వైస్ ఎంపిపి షాకిర్ , కాగ్రెస్ నాయకులు హుగ్గేలి రాములు,యువజన జిల్లా అధ్యక్షులు నరేష్ గౌడ్, మాజీ యువజన జిల్లా అధ్యక్షులు ఉదయ్ శంకర్ పాటిల్,మరియు కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు తథిదరులు పాల్గొన్నారు.