
ప్రభుత్వ వాహనం మైంటెనెస్ చేయడం లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన డ్రైవర్ సిబ్బందికి ప్రశంస పత్రాలు అందచేసిన మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ ఐపిఎస్.
మరిపెడ నేటి దాత్రి.
మహబూబాబాద్ జిల్లా పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ లకు కేటాయించిన ప్రభుత్వ వాహనాలు ప్రతి యేటా మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయం నుండి ఏ.ఆర్ డిఎస్పీ విజయ ప్రతాప్, ఎస్.బి సీఐ బాలాజీ వరప్రసాద్, ఆర్ ఐ (ఎం టి ఓ) మరియు టీం ప్రతి పోలీస్ స్టేషన్ లో వాహనాలు ఇన్స్పెక్షన్ చేసి రిపోర్ట్ తీసుకోవడం జరుగుతుంది అన్నారు,మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ ఐపిఎస్ ఆదేశాల మేరకు ఈ సంవత్సరం కూడా తమకు కేటాయించాబడిన వాహనాలు సక్రమం గా మైంటైన్ చేస్తూ వెహికల్ కండిషన్ లో ఉండేలా చూసుకుని విధులు నిర్వహిస్తున్న వారికీ జిల్లా ఎస్పీ చేతుల మీదిగా రాంపల్లి ఉమేష్ కి ప్రశంస పత్రాలు అందించి అభినందించడం జరిగింది.ప్రతి సంవత్సరం ఇలాగే ఇన్స్పెక్షన్ నిర్వహించి వాహన మెయింటనెన్స్ లో ప్రతిభ కనపరచిన వారికీ ఇలానే ప్రశంసలు అందుతాయాన్ని ఎస్పీ అన్నారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ జోగుల చెన్నయ్య, ఆర్ ఐ (ఎం టి ఓ) , సిబ్బంది పాల్గొన్నారు.