నేటిధాత్రి కమలాపూర్(హన్మకొండ)రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు చెన్నూర్ మాజీ శాసన సభ్యుడు బాల్క సుమన్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని కోరుతూ హుజురాబాద్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలసాని రమేష్ గౌడ్,నియోజక వర్గ యూత్ ప్రధాన కార్యదర్శి పొడిటి బిక్షపతి ఆధ్వర్యంలో కమలాపూర్ సిఐ కి వినతి పత్రం అందచేశారు.అనంతరం వారు మాట్లాడుతూ ప్రజాపాలన పేరుతో,ప్రజాస్వామ్య యుతంగా పాలన సాగిస్తున్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన ను చూసి ఓర్వలేక ప్రతిపక్ష బిఆర్ఎస్ నాయకులు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని,బాల్క సుమన్ వెంటనే తాను మాట్లాడినా మాటలకు క్షమాపణ చెప్పాలని,లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా అతడిని అడ్డుకుంటామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో వారితో పాటు నాయకులు జనగాని శివకృష్ణ,రాజు,రవీందర్,ఆరున్,నరేష్ తదితరులు పాల్గొన్నారు.