గంజాయితో పట్టుబడిన యువకుడు పై కేసు నమోదు

సిఐ మహేందర్ రెడ్డి,ఎస్సై రాజశేఖర్

రామకృష్ణాపూర్, జనవరి 08, నేటిధాత్రి:

రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుడిపల్లి గ్రామానికి చెందిన జాడీ రవికిరణ్ గంజాయి సేవిస్తూ అమ్మకాలు చేపడుతున్న నేపథ్యంలో కేసు నమోదు చేసినట్లు మందమర్రి సిఐ మహేందర్ రెడ్డి, ఆర్కేపి ఎస్ ఐ రాజశేఖర్ తెలియజేశారు. గుడిపల్లి గ్రామంలో పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో రవికిరణ్ అనుమానాధాస్పదంగా కనిపించడంతో తనిఖీ చేయడం జరిగిందని, తనఖి సమయంలో 100 గ్రాముల గంజాయి లభించినట్లు ఎస్సై రాజశేఖర్ పేర్కొన్నారు. యువకుడి పై కేసు నమోదు చేసినట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా సిఐ మహేందర్ రెడ్డి, ఎస్సై రాజశేఖర్ లు మాట్లాడుతూ…. రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యువకులు ఎవరైనా గంజాయి సేవించిన, గంజాయి సరఫరా చేసిన చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పిడియాక్టు కేసు నమోదు చేస్తామని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!