వచ్చేది కేసీఆరే.. అభివృద్ధి చేసేది పుట్ట మధన్నే.
బీఆర్‌ఎస్ మేనిఫేస్టోతో మరిన్ని ప్రయోజనాలు.
గ్యారెంటీ లేని పథకాలు కాంగ్రెస్ పార్టీవి.
ఎడ్లపల్లి గ్రామంలో ఇంటింటా మేనిఫేస్టో, కుంకుమ బొట్టు ప్రచారం నిర్వహించిన మండల మహిళా అధ్యక్షురాలు పంతకాని చంద్రకళ
మలహర్ రావు. నేటిధాత్రి,
మండలంలో ఇంటింటా మేనిఫేస్టో, కుంకుమ బొట్టు ప్రచారంలో భాగంగా మండల అధ్యక్షులు కుంభం రాఘవరెడ్డి గ్రామ ఇంఛార్జి వాల యాదగిరి రావు, ఆదేశానుసారం మండల సోషల్ మీడియా ఇంఛార్జి సుమన్ గ్రామ కమిటీ అధ్యక్షులు పంతకాని వెంకట్ రాజు అధ్వర్యంలో బీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫేస్టోను వివరిస్తూ బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధుకర్ కు ఓటువేసి గెలిపించాలని అభ్యర్థించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ అభివృద్ది సంక్షేమం పుట్ట మధూకర్‌తోనే సాధ్యమవుతాయని అన్నారు.కరోనా విపత్కర పరిస్థితుల్లో ఎవరూ చేయలేని సాహసం చేశారని, కరోనా మృతులకు దగ్గరుండి గౌరవంగా అంత్యక్రియలు చేసి, ఇటు ప్రభుత్వపరంగా అటు తన సొంతంగా అనేక సేవలు అందించారని, రాబోయే రోజుల్లో సైతం పుట్ట మధూకర్ ఎమ్మెల్యేగా గెలిస్తే ప్రభుత్వ పథకాలతో పాటు తన సొంతంగా మరిన్ని గొప్ప సేవలు అందిస్తారని వారు స్పష్టం చేశారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల కన్నీళ్లు కష్టాలుపట్టించుకుంటారని, పేదోడి ఆకలి తీర్చాలనే ఆరాటం ఉన్న గొప్ప సేవకుడు పుట్ట మధూకర్ అని కొనియాడారు. రాష్ట్రంలో రాబోయేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని, సీఎంగా కేసీఆర్ పాలన అందిస్తారని, ఆయన నాయకత్వంలో ఎమ్మెల్యేగా పుట్ట మధూకర్‌ను గెలిపించుకుంటే ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. కేవలం ఓట్లు, కుర్చి కోసం ఆరాటపడే కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దని, గ్యారెంటీ లేనిపథకాలతో ముందుకు వస్తున్నారని వారు విమర్శించారు. మంథని గడ్డపై గులాబీ జెండా ఎగిరేలా ప్రతి ఒక్కరు ఆలోచన చేసి కారు గుర్తుకు ఓటు వేయాలంటూ అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు మంథని బాపు, అక్కినవేని రాధ శ్రీనివాస్, తోట స్వరూప రమేష్, పట్టి రాజమ్మ, అక్కినవేని శాంత, నాయకులు బత్తుల తిరుపతి,మంథని బుచ్చయ్య, కొలేటి రాజబాబు, మహిళా నాయకులు మంథని పోశక్క, అంబాల సుగుణ, గడ్డం కిస్టక్క, పంతకాని స్వర్ణలత, తోగరి మహేశ్వరి, అక్కినవేని లక్ష్మి, తోట సమ్మక్క, చేనవెని రాజమ్మ, చోప్పరి సారమ్మ, పెయ్యల సమ్మక్క, పుట్ట మధు యువసేన మండల అధ్యక్షులు పిలమరి నరేష్, నాయకులు తోట సత్యనారాయణ, మంథని బుచ్చయ్య, రాజ సమ్మయ్య, రాజేందర్, రాజబాబు, శ్రీనివాస్, రాజేష్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితర పాల్గొన్నారు.