రెండు దశాబ్దాలుగా ప్రారంభానికి నోచుకోక శిథిలావస్థలోకి చేరిన బస్ స్టాండ్

నిర్మాణ పనులు పూర్తిచేసుకుని 24 సంవత్సరాలు

మంచిర్యాల జిల్లాలోని జైపూర్ మండల కేంద్రంలో ప్రయాణికుల సౌకర్యం కోసం బస్టాండ్ నిర్మాణం పూర్తి చేసుకొని 24 సంవత్సరాలు గడిచిన ప్రారంభానికి నోచుకోలేదు . రెండు దశాబ్దాల క్రితం అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అప్పటి ఎమ్మెల్యే బోడ జనార్దన్ చొరవతో జైపూర్ మండల కేంద్రంలో బస్టాండ్ నిర్మాణం పనులు పూర్తి చేసినారు. బస్టాండ్ కాంట్రాక్ట్ పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు నిర్మాణ పనులు పూర్తిచేసిన కూడా ప్రారంభోత్సవానికి నోచుకోని కారణాలు ఏమిటనేవి ఇప్పటికీ ఎవరికి తెలియని రహస్యం.అప్పుడున్న పరిస్థితుల్లో బస్టాండ్ మండల కేంద్రానికి దూరంగా ఒంటరిగా ఉండడమే ప్రధాన కారణమని కొందరూ ఊహగానం వ్యక్తం చేశారు. కాలం గడుస్తున్నా కొద్దీ మండల తహసిల్దార్ కార్యాలయం, పెరిగిన జనావాసాలు, నూతనంగా నిర్మించుకున్న ఇల్లు ,వ్యాపారాల కోసం ఏర్పరచుకున్న దుకాణాలు,హోటల్లు, మరియు వ్యవసాయ శాఖకు సంబంధించిన కార్యాలయాలు, తపాలా కార్యాలయం,బాలికల ప్రభుత్వ గురుకుల పాఠశాల, కళాశాల,పలు ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలతో ఇప్పుడున్న పరిస్థితులలో బస్టాండ్ పరిసర ప్రాంత అంతయు అభివృద్ధి చెందినది.జైపూర్ మండల కేంద్రానికి సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ ఒక అలంకరణగా నిలిచిన ప్రస్తుత పరిస్థితిలో బస్టాండ్ పునర్నిర్మాణం చేయాలని ప్రజలు కోరుతున్నారు. రహదారుల వెడల్పులో భాగంగా రోడ్డు ఇరువైపులా ఉన్న చెట్లను కొట్టి వేయడంతో ప్రజలు కాసేపు నిలబడి సేద తీరడానికి కూడా నిలువ నీడ లేకుండా పోయిందని, వస్తున్న వేషవికాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలను ఎండ తాపం నుండి కాపాడే విధంగా వీలైనంత తొందరగా బస్సులు నిలిపే నిర్ణీత స్థలంలో నూతన బస్టాండ్ నిర్మాణం చేపట్టి ప్రయాణికులకు ఉపయోగపడే ప్రయాణ సౌకర్య వసతి గా మార్చాలని చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ ని జైపూర్ మండల ప్రజలు కోరుతున్నారు.జైపూర్ మండల కేంద్రంలో ఉన్న బస్టాండ్ చిన్న పల్లెటూరు గ్రామంలో ఉండే అభ్యర్థన బస్టాండ్ మాదిరిగా ఉందని, రోడ్డుపై ప్రయాణికులు ఎర్రని ఎండలో నిలుచొని బస్సుల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి దశాబ్దాలుగా కొనసాగుతుందని, ఈ దుస్థితి నుండి నిర్ణీత బస్టాండ్ లో బస్సులు వచ్చే సమయం దాకా సేద తీర్చుకున్నాక బస్సులలో ఎక్కి ప్రయాణించే మాదిరిగా నూతన బస్టాండ్ నిర్మాణం చేపట్టే విధంగా కృషి చేయాలని జైపూర్ మండల ప్రజా ప్రతినిధులను, నాయకులను, సంబంధిత అధికారులను జైపూర్ మండల కేంద్రంలోని ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!