CAT Exam Tough This Year
ఒకింత కష్టంగానే క్యాట్
ఆశ్చర్యాలు ఏమీ లేనప్పటికీ ఈ ఏడాది క్యాట్ ఒకింత కష్టంగానే ఉందని విద్యార్థులు, నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గత రెండుమూడేళ్లుగా క్యాట్‌లో….
డీఐఎల్ఆర్ విభాగంలో ట్రికీగా ప్రశ్నలు
ఈ ఏడాది క్యాట్‌లో పేరాగ్రాఫ్ జంబుల్ ప్రశ్నలు కూడా ఇచ్చారు. మల్టీపుల్ ఛాయి్స(ఎంసీక్యూ)తోపాటు జవాబును నేరుగా టైప్ చేయాల్సిన (టిటా) ప్రశ్నలకు ఈసారి సమ ప్రాధాన్యం లభించింది. డీఐఎల్‌ఆర్‌లో అడిగిన ప్రశ్నలు ట్రికీ(యుక్తి)గా ఉండటంతో అభ్యర్థులకు ఈ విభాగం కష్టంగా మారిందని కెరీర్లాంచర్ కోఫౌండర్ గౌతమ్‌పురి అభిప్రాయపడ్డారు. విధానంలో మార్పులు లేనప్పటికీ డీఐఎల్‌ఆర్‌లో అడిగిన ప్రశ్నల కారణంగానే అలా అనిపిస్తోందని టైమ్ సీనియర్ కోర్స్ డైరెక్టర్ రామ్‌నాథ్ కనకదండి తెలిపారు. మూడో సెషన్లో క్వాంటిటేటివ్ ఎబిలిటీ కష్టంగా అనిపించిందని విద్యార్థులు తెలిపారు. మొదటి సెషన్లో అడిగిన ప్రశ్నల తీరు గత ఏడాదితో పోల్చుకుంటే కష్టంగానే ఉందని అంటున్నారు. క్వాంటిటేటివ్ ఎబిలిటీలో మెజారిటీ ప్రశ్నలు అర్థమెటిక్, ఆల్జీబ్రా నుంచే అడిగారు. రీడింగ్ కాంప్రహెన్షన్ కింద ఎలకా్ట్రనిక్ మ్యూజిక్, లా అండ్ మెంటల్ హెల్త్, నాయిస్ అండ్ సోషల్ ఆర్డర్, ఇన్కమ్ ఇనీక్వాలిటీ అండ్ ఎకనామిక్ గ్రోత్‌పై పేరాగ్రాఫ్స్ ఇచ్చారు. రెండో సెషన్లో కాఠిన్య స్థాయి దాదాపు మొదటి సెషన్ స్థాయిలోనే ఉంది. 2022, 2023ల్లో మాదిరిగా కష్టంగా ఉందని మరికొందరు అభిప్రాయపడ్డారు. డీఐఎల్ఆర్ విభాగం కష్టంగా ఉండగా, వీఏఆర్సీ, క్యూఏ మోడరేట్‌గా ఉన్నాయి. డీఐఎల్‌ఆర్‌లో మల్టీపుల్ ఛాయిస్, టిటా ప్రశ్నలు 11 చొప్పున అడిగారు. వీఏఆర్‌సీలో 10 నుంచి 12.. అంటే సగం వరకు ప్రశ్నలకు జవాబులు సులువుగానే గుర్తించవచ్చు. క్వాంటిటేటివ్ ఎబిలిటీలో ఆరేడు ప్రశ్నలకు జవాబులు కరెక్ట్‌గా గుర్తిస్తే 90 పర్సంటైల్, అదే 10-11 సరిగా గుర్తిస్తే 99 పర్సంటైల్ వస్తుందని అభ్యర్థులు చెబుతున్నారు. మూడో సెషన్ సైతం మొదటి రెండింటి మాదిరిగానే ఉందన్నది సమాచా రం. అయితే, మూడోది కష్టంగా ఉందని కొద్దిమంది విద్యార్థులుతెలిపారు. క్వాంటిటేటివ్ ఎబిలిటీ విభాగం అందుకు కారణమని చెబుతున్నారు. ఈ సెషన్లో డీఐఎల్ఆర్ సులువుగా ఉంది. అర్థమెటిక్‌లో 8-9 ప్ర శ్నలు అడిగారు. రీడింగ్ కాంప్రహెన్సన్లో నాలుగింటికి రెండు కష్టంగా ఉన్నాయని కొందరు తెలిపారు.
