నేటిధాత్రి, వరంగల్
వరంగల్ మహానగరపాలక సంస్థలో అడిషనల్ చీఫ్ సిటీ ప్లానర్ గా పనిచేస్తున్న భానోతు వెంకన్న నాయక్ వరంగల్ బల్దియా నుండి జిహెచ్ఎంసికి పదోన్నతి పై బదిలీ కావడంతో గ్రేటర్ వరంగల్ లోని గోర్ బంజారా పలు సంఘాలు శాలువాతో గజమాలతో ఘనంగా సత్కరించారు. ఆదివారం హన్మకొండ లోని జిఎస్ కన్వెన్షన్ హాల్లో గోర్ బంజారా సేవాలాల్ సంక్షేమ సంఘం అధ్యక్షులు బాదావత్ బాలాజీ నాయక్ అధ్యక్షతన జరిగిన సన్మాన కార్యక్రమంలో మహబూబాబాద్ మాజీ ఎంపీ, బిజెపి రాష్ట్ర నాయకులు అజ్మీర సీతారాం నాయక్ మాట్లాడుతూ., సిటీ ప్లానర్ వెంకన్న నాయక్ తన వృత్తిని దైవంగా భావించి , విశిష్ట సేవలు అందించి , గోర్ బంజారా జాతికి సైతం సేవలు అందిస్తూ, జాతి సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచస్థాయికి తీసుకెళ్తూ , రానున్న రోజుల్లో జాతి ప్రాముఖ్యతను మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆయన కోరారు.( గోర్ బొలీ) బంజార భాష ను 8 వ షెడ్యూల్ లో చేర్చె విధంగా బంజారాలు ఐక్యత గా ఉండి పోరాడాలని కోరారు.సన్మాన గ్రహీత అడిషనల్ చీఫ్ సిటి ప్లానర్ భానోత్ వెంకన్న నాయక్ మాట్లాడుతూ… ఎక్కడ పుట్టిన ఎక్కడ పెరిగిన బంజారా జాతి సంప్రదాయాలను మరిచిపోకూడదని, గోర్ బోలిని, సీత్ల, తీజ్ పండగలను ప్రపంచంలోనీ అగ్రదేశాల్లో ఉద్యోగరీత్యా స్థిరపడిన వారు సైతం జరుపుకొని తమ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతున్నారని, రానున్న రోజుల్లో గోర్ బంజారాలు ఐక్యతగా ఉండి తమ హక్కులను రాష్ట్రం,కేంద్రంలో రావాల్సిన తమ యొక్క వాటాలను సాధించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డిసిపి రాగ్య నాయక్, రాష్ర్ట తహసిల్దార్ ల సంఘం ప్రధాన కార్యదర్శి పూల్ సింగ్ చౌహన్, గొర్ సేనా రాష్ట్ర అద్యక్షులు బాణోతు కిరణ్,గోర్ సిక్వాడి ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ కున్సోత్త్ హాట్య నాయక్, ఎస్బిఐ ఏజీఎం శంకర్ నాయక్, అసిస్టెంట్ డైరెక్టర్ తేజావత్ బాలాజీ నాయక్ , కో-ఆపరేటివ్ యాకుబ్ నాయక్ , తెలుగు పీఠాధిపతి భూక్యా బాబురావు, మానవ హక్కుల రాష్ట్ర ఉపాధ్యక్షులు బాధావత్ రాజు నాయక్, బంజారా వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు వి.ఎన్. నాయక్, భూక్యా సాంబయ్య నాయక్ ,జెడ్ . రాందాస్, గోర్ మాటి మలావ్ వెల్ఫేర్ సొసైటీ నుండి ఎంఈఓ రాములు నాయక్ , రవీందర్ నాయక్, భూఖ్య మల్సూర్ అసిస్టెంట్ ఇంజనీర్, మహేశ్వర్ నాయక్, ఎస్ ఐ గంగు నాయక్, వాల్య నాయక్, సన్మాన కార్యక్రమ నిర్వాహకులు గోరు బంజారా సేవాలాల్ సంక్షేమ సంఘం కోశాధికారి గుగులోతు తిరుపతి, సహాయ కార్యదర్శి వినేష్ , గోర్ సేన జిల్లా అధ్యక్షులు తేజావత్ ఫణి కుమార్ ,బిజెపి నాయకులు మాలోతునాను నాయక్, గుగులోత్ మదన్, బాదా వత్ ప్రదీప్, ఆర్టీసి సజ్జన్ నాయక్, గోపాల్పురం సేవాలాల్ దేవాల కమిటీ సభ్యులు జవహర్లాల్ , జవహర్, రామ్ చంద్రు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మెంబర్లు జవహర్లాల్, ఉషన్ నాయక్ , డా.చందు,గోర్ బంజార ప్రముఖులు,ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.