
Bridge-cum-Regulator
నిండుకున్న నారింజ బ్యారేజ్.
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ మండలం కొత్తూరు (బి) గ్రామంలోని నారింజ బ్రిడ్జి కమ్ రెగ్యులేటర్ ఇటీవల కురుస్తున్న వర్షాలకు నిండుకుండలా మారింది. 85 ఎం సి ఎఫ్ టి ల సామర్థ్యం గల ఈ ప్రాజెక్ట్ పూర్తి స్థాయి సామర్థ్యంతో జలకళను సంతరించు కొంది. 498 క్యూసెక్కు ల ఇంట్లో నీరు వస్తుండగా అంతే నీరు ఔట్ ఫ్లో గా వెళుతుంది. వరద నీటి ప్రవాహం పెరిగితే గేట్లు ఎత్తవలసి ఉంటుందని ఇరిగేషన్ ఉప కార్యనిర్వాహక ఇంజనీర్ జనార్దన్ రావు తెలియజేశారు.