వరంగల్, నేటిదాత్రి:
వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో సినీమా తరహాలో బ్యాంకులో చోరీ జరిగింది. మనీ హీస్ట్ తరహాలో దొంగలు బంగారం లూటీ చేశారు. రాయపర్తి మండలంలోని ఎస్బిఐ బ్యాంకు కిటికీలు పగలగొట్టి, ఆక్సిజన్ సిలిండర్లు, గ్యాస్ కట్టర్లతో ఎంట్రీ ఇచ్చిన దొంగలు బ్యాంకు లాకర్లను పగలగొట్టినారు. అనంతరం అందులో ఉన్న 497 మందికి చెందిన 13 కోట్ల 60 లక్షల విలువైన, 19.5 కిలోల బంగారాన్ని దోపిడీ చేశారు. పోలీసులు చోరీ కేసును వేగవంతంగా దర్యాప్తును ప్రారంభించారు. ఇది అంతరాష్ట్ర ముఠా పనిగా భావిస్తున్నారు. ఇటీవల కర్ణాటక దావనగిరిలో ఇదే తరహాలో దోపిడీ జరిగినట్టు పేర్కొన్నారు.