సిడిపిఓ అవంతి.
చిట్యాల, నేటిదాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని తిరుమలాపూర్ వన్ అండ్ టూ సెంటర్ ను సిడిపిఓ అవంతి మంగళవారం రోజున ఆకస్మిక తనిఖీ చేసినారు, వారు మాట్లాడుతూ గర్భవతులకు బాలింతలకు తీసుకోవలసిన సమతుల్ ఆహారము ఆరోగ్య పరీక్షలు ప్రతినెల బరువు ఎత్తు
చూయించుకోవడం అంగన్వాడీ కేంద్రానికి ప్రతిరోజు ఉదయం 11 గంటల నుండి 12 గంటల సమయంలో వచ్చి భోజనం చేయాలని అప్పుడే నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వివరించారు, ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలే బిడ్డ పట్టించాలని ఇతర పానీయాలు తాగించరాదని సూచించినారు, హాజరైన తల్లులందరికీ భోజనము పాలు తన చేతుల మీదుగా అందించి 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలను కేంద్రానికి పంపించాలని కేంద్రంలో ఎల్కేజీ యూకేజీ సంబంధించిన బుక్స్ ఉన్నవని ప్రైవేట్ స్కూల్ కి పంపవద్దని సూచించినారు, అనంతరం ఈ గర్భవతుల ఎత్తులు బరువులు స్వయంగా రికార్డ్ చేసినారు. కార్యక్రమంలో జయప్రద సూపర్వైజర్ కవిత త్రివేణి రమణమ్మ హాజరైనారు అనంతరం గర్భవతుల బరువులు ఎత్తులు స్వయంగా చూసి రికార్డు చేసినారు,