
Roshini and Priyanka Win Vaibhavalakshmi Mall Lucky Draw
వైభవలక్ష్మి షాపింగ్ మాల్ లక్కీడ్రా విజేతలు రోషిణి, ప్రియాంక
నేటిధాత్రి, వరంగల్.
వరంగల్, జెపిఎన్ రోడ్డు లోని, వైభవలక్ష్మి షాపింగ్ మాల్లో బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా నిర్వహించిన లక్కీ డ్రా కార్యక్రమాన్ని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ప్రారంభించారు.
మొదటి, రెండవ లక్కీ డ్రా నంబర్లను చిన్నారుల చేతుల మీదుగా తీయించారు. లక్కీ డ్రాలో బహుమతులు గెలుచుకున్నవారికి ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు ఎంపీ కావ్య. లక్కీ డ్రాలో మొదటి బహుమతి గెలుచుకున్న కాశీబుగ్గకు చెందిన జి. రోషిణి (కూపన్ నంబర్ B-373) ఒక కిలో వెండి బహుమతిగా అందుకున్నారు. రెండవ బహుమతి విజేత రెడ్డిపాలెంకు చెందిన జె.
ప్రియాంక (కూపన్ నంబర్ J-250) టీవీఎస్ జూపిటర్ ద్విచక్ర వాహనాన్ని గెలుచుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ, పట్టుదలతో, నిజాయితీగా కష్టపడితే జీవితంలో ఏదైనా సాధించవచ్చు అని తెలిపారు. వినియోగదారులకు నాణ్యమైన వస్త్రాలను తక్కువ ధరలకు అందించాలని షాపింగ్ మాల్ యాజమాన్యానికి సూచించారు. యువ వయస్సులోనే వ్యాపారరంగంలో అడుగుపెట్టి మాల్‌ను స్థాపించిన యాజమాన్య ప్రతినిధులను ఎంపీ అభినందించారు. పండుగ శుభ సందర్భాలలో ప్రజలకు ఆనందాన్ని పంచేలా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం చిరస్మరణీయమని, కస్టమర్ల విశ్వాసమే మాల్ విజయానికి మూలస్థంభమని అభినందించారు. ఈ కార్యక్రమంలో వైభవలక్ష్మి షాపింగ్ మాల్ డైరెక్టర్లు ప్రదీప్, హరీష్, రిషిత, సూరజ్ తదితరులు పాల్గొన్నారు.