
Minister Urges Youth to Stay Away from Drugs
యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి: మంత్రి ప్రభాకర్
యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. డ్రగ్స్‌తో యువత ఉజ్వల భవిష్యత్తు నాశనం అవుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) విజ్ఞప్తి చేశారు. ఇవాళ(ఆదివారం) అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ఆధ్వర్యంలో బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్క్ వద్ద ‘స్టాప్ సబ్స్ టెన్స్ అబ్యూస్’ రన్ జరిగింది. ఈ రన్ని మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. యువతలో మాదకద్రవ్యాల వినియోగం పెరుగుతోందని చెప్పుకొచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్.