
CPM Calls to Support Honest Leaders in Local Polls
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఎం బలపరిచిన వ్యక్తులను గెలిపించండి
సి.పి.ఎం జిల్లా కార్యదర్శి ముశం రమేష్
సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)
ఈరోజు అమృత్లాల్ శుక్ల కార్మిక భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి
ముశం రమేష్ మాట్లాడుతూ..రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఎం పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో జడ్పిటిసి ఎంపిటిసి సర్పంచ్ కానాలకు వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో పోటీ చేయనున్నది.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిపిఎం కార్మిక కర్షక బడుగు బలహీన వర్గాల పక్షాన నిలబడి అనేక పోరాటాలు నిర్వహిస్తూ వస్తున్నది
కాంగ్రెస్ బిజెపి టిఆర్ఎస్ పార్టీలు తమ స్వార్ధ రాజకీయ ప్రయోజనాలు మాత్రమే పనిచేస్తున్నాయి తప్ప ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ఏ ఒక్క పార్టీ కూడా నిజాయితీగా ప్రజల కొరకు పనిచేసిన దాకాలు లేవు ఎన్నికల సందర్భంగా అనేక హామీలు ఇచ్చి ఎన్నికల అయిన తర్వాత హామీలను అమలు చేయకుండా తుంగలో తొక్కేయడం పెట్టుబడిదారి పార్టీలకు ఆనవాయితీగా మారింది చట్టసభల్లో కమ్యూనిస్టు పార్టీల ప్రాతినిధ్యం తగ్గిపోవడంతో విచ్చలవిడిగా అవినీతి రాజ్యమేలుతున్న పేదల సమస్యలు పరిష్కారం కావడం లేదు రాజన్న సిరిసిల్ల జిల్లాలో భూ అక్రమాలు ఇసుక మాఫియా. ప్రకృతి సంపద దోచుకోవడం. రోజురోజుకు పెరిగిపోతాయి ప్రశ్నించే గొంతుక లేకపోవడం వలన అవినీతి రాజ్యమేలుతుంది ప్రజల సమస్యలు పక్కన పోతున్నాయి.నీతికి నిజాయితీకి క్రమశిక్షణకు మారుపేరైనటువంటి సిపిఎం పార్టీ అభ్యర్థులను ప్రజా సమస్యల పరిష్కారం కొరకురాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజానీకానికి సిపిఎం జిల్లా కమిటీ విజ్ఞప్తి చేస్తుంది.ఈ సమావేశంలో సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యులు ఎగమంటి ఎల్లారెడ్డి. కోడం రమణ సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సూరం పద్మ,శ్రీరాముల రమేష్,
చంద్ర సిపిఎం నాయకులు,సందు పట్ల పోచమ్మల్లు, గడ్డం రాజశేఖర్,తదితరులు పాల్గొన్నారు.