
Asif Patel Demands ZPTC Ticket for Minorities
జడ్పీటీసీ అభ్యర్ధిగా మైనార్టీలకు అవకాశం: బీఆర్ఎస్ నాయకుడు ఆసిఫ్ పటేల్ డిమాండ్
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్,త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జడ్పీటీసీ అభ్యర్థిగా మైనార్టీలకు అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆసిఫ్ పటేల్ డిమాండ్ చేశారు. జహీరాబాద్ నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో కనీసం ఒక్క మండలంలోనైనా మైనార్టీలకు అవకాశం కల్పించాలని ఆయన కోరారు. అన్ని రాజకీయ పార్టీలు మైనార్టీలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన బుధవారం జహీరాబాద్ పట్టణంలో మీడియాతో మాట్లాడుతూ పేర్కొన్నారు.