
Comrade Chandragiri Shankar Extends Dasara Greetings to Workers
ప్రజలకు కార్మికులకు దసరా శుభాకాంక్షలు
ఏఐఎఫ్ టీయు రాష్ట్ర నాయకుడు కామ్రేడ్ చంద్రగిరి శంకర్
భూపాలపల్లి నేటిధాత్రి
కేంద్రంలో బిజెపి మోడీ ప్రభుత్వం కార్మికుల పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లను మార్చి కార్పొరేట్లకు వారి ఆస్తులను పెంపొందించు కోవడానికి నల్ల చట్టాలను ఏర్పాటు చేశారని
ఏఐఎఫ్ టీయు రాష్ట్ర నాయకుడు కామ్రేడ్ చంద్రగిరి శంకర్ అన్నారు
కేంద్ర ప్రభుత్వం రంగా సంస్థలైన విమానాయం నౌకాయానం రైల్వే బుకింగ్ ఎల్ఐసి డిఫెన్స్ బొగ్గు భూగర్భ ఖనిజ సంపద కార్పోరేట్లకు శక్తులకు దోచిపెట్టడాన్ని ఆవేదన వ్యక్తం చేశారు 8 గంటల పని దినం రద్దుచేసి 12 గంటల పని విధానం తెచ్చిపెట్టడాన్ని ఉత్పత్తిలో సర్వీసులో సేవరంగాల్లో మరో మనుషులను తెచ్చే విధానాన్ని రద్దు చేయాలని కార్మిక హక్కుల కోసం పోరాడాలని కోరుచున్నాను సింగరేణి కార్మిక వర్గానికి శ్రామిక వర్గానికి దసరా శుభాకాంక్షలు ఏఐఎఫ్ టీయు రాష్ట్ర నాయకులు కామ్రేడ్ చంద్రగిరి శంకర్