
Sheikh Rabbani Extends Dasara Greetings
ఝరాసంగం మండల ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపిన
◆:- మండల ఎంఐఎం పార్టీ అధ్యక్షులు షేక్ రబ్బాని
జహీరాబాద్ నేటి ధాత్రి:
ప్రజలందరిలోనూ దసరా సంతోషాన్ని నింపాలని ఝరాసంగం మండల ఎంఐఎం పార్టీ అధ్యక్షులు షేక్ రబ్బాని పేర్కొన్నారు. దసరా నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. చెడుపై మంచికి విజయానికి ప్రతీకగా చేసుకునే దసరా పండగలో అందరి జీవితాల్లోనూ కొత్త వెలుగు నింపాలని కోరారు. శాంతియుత, అభివృద్ధి కారక సమాజం కోసం అందరూ కృషి చేయాలని ఆయన కోరారు.చెడుపై మంచి, దుష్టశక్తులపై దైవశక్తి విజయానికి ప్రతీక దసరా అని, చెడు ఎంత దుర్మార్గమైనా, శక్తిమంతమైనా అంతిమ విజయం మంచినే వరిస్తుందని ఎంఐఎం పార్టీ మండల అధ్యక్షులు షేక్ రబ్బాని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు ఆయన దసరా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా సుఖశాంతులు, సిరి సంపదలతో తలతూగాలని ఆయన కోరారు.