
Panchaloha Vahanams Donated for Sri Vari Brahmotsavam
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పంచ లోహ వాహనాలు అందజేత
ఇబ్రహీంపట్నం, నేటిదాత్రి
మండలంలోని వర్ష కొండలో దసరా శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా గ్రామానికి చెందిన మంగిలిపెల్లి మహిపాల్ ఎన్నారై స్వామివారికి ఐదు పంచలోహ వాహనాలు కోసం హంస వాహనము, హనుమాన్ వాహనము, సింహ వాహనము, గోమాత వాహనము, గజవాహనము, వాహనాల కోసం సుమారుగా రెండు లక్షల యాభై వేల రూపాయలు విలువ గల స్వామివారి వాహనాల తయారు కి విరాళంగా ఇచ్చాడు మరియు గతంలో మండల్ పరిషత్ ప్రాథమిక పాఠశాల పిల్లలకు ఆట వస్తువులు మరియు పాఠశాలకు రంగులు మరియు దేశ భక్తుల చిత్ర పటాలువేయించారు సుమారుగా మూడు లక్షల రూపాయలు విరాళంగా అందజేశాడ మరియు జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల లో విద్యార్థిని విద్యార్థుల కోసం క్రీడ ప్రాంగణం ఏర్పాటు చేయాలని పది లక్షల రూపాయలు ఇస్తా అని మాట ఇచ్చారు మహిపాల్ మాట్లాడుతూ ఉన్న ఊరికి సహాయం చేయడం ఎంతో సంతోషంగా ఉందని అతను మాట్లాడారు అనంతరం ఇంతటి గొప్ప మహాదాతకు గ్రామం తరపున గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో అర్చకులు మధుర అన్వేష్చార్యులు ఆనందం వ్యక్తం చేశారు.