
Former Councilor Participates in Temple Navaratri Pooja
శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అమ్మవారి సేవలో మాజీ కౌన్సిలర్ దంపతులు
వనపర్తి నేటిదాత్రి .
వనపర్తి పట్టణంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయం లో అమ్మవారి అభిషేకం పూజలో 33 వ వార్డు మాజీ కౌన్సిలర్ తిరుమల్ అలేఖ్య దంపతులు అంగడి నరేందర్ కట్ట సుబ్బయ్య పాల్గొన్నారు. ఈ మేరకు ఆలయ చైర్మన్ అయ్యలూరి రఘునాథం చార్యులు వారిచే అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయించారు . అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామికి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని చైర్మన్ కోరారు