
CM Assistance Fund Given to Beguloor Resident
పేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి
ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం
మహాదేవపూర్ సెప్టెంబర్ 27 నేటి దాత్రి *
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం బెగుళూర్ గ్రామానికి చెందిన కొయ్యల రమ కు 24000 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్ అందించడం జరిగింది. మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కటకం అశోక్ మాట్లాడుతూ పేద ప్రజలకు అండగా ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆదుకుంటూ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను సోమవారం వారి నివాసంలో లబ్ధిదారులకు అందజేశారు. ప్రజాభివృద్ధి సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి సహాయనిధి పేద ప్రజలకు అండగా నిలుస్తున్నదని ముఖ్యమంత్రి సహాయనిధితో ప్రభుత్వం ప్రజలను ఆదుకుంటుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అందజేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో మండల అధికార ప్రతినిధి శివరాజ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు