
Dr Hothi Basavaraj Crafts Three-Foot Amman
కళ్లకు గంతలు కట్టి అమ్మవారి ప్రతిరూపం
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం : మన దేశంలో దసరా పండుగను ధనిక-బీద తేడా లేకుండా ప్రజలు ఆనందంగా జరుపుకుంటున్నారు. సంగారెడ్డి జిల్లా న్యాల్ కల్ మండల కేంద్రానికి చెందిన ప్రఖ్యాత శిల్పి డాక్టర్ హోతి బస్వరాజ్ అమ్మవారి పై ఉన్న భక్తితో కళ్లకు గంతలు కట్టి, కేవలం ఒక గంట పది నిమిషాల వ్యవధిలో మట్టితో మూడు అడుగుల ఎత్తు ఉన్న అమ్మవారి ప్రతిరూపాన్ని తీర్చిదిద్దారు. తన మదిలో తలచుకున్న అమ్మవారి రూపాన్ని ప్రతిష్టాత్మకంగా మలిచినట్లు తెలిపారు. “ప్రతి కళాకారుడి మదిలో రకరకాల కళారూపాలు దాగి ఉంటాయి. మనిషి ఏ విషయం పై ఎక్కువగా ఆలోచిస్తే ఆ ఆలోచనలు స్పష్టంగా కళ్ల ముందు నిలుస్తాయన్నారు. విశ్వాసం, నమ్మకం ఉంటే ఏ పని సాధ్యమే. భగవంతుని కరుణ ఉంటే విజయవంతం అవుతాం” అని శిల్పి డాక్టర్ హోతి బస్వరాజ్ అన్నారు.