
Bomb Threat at Shamshabad Airport
బిగ్ బ్రేకింగ్.. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు
శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ఇవాళ(ఆదివారం) బాంబు బెదిరింపు చేశారు దుండగులు. బాంబు ఉందంటూ ఈమెయిల్ పంపించారు దుండగులు. ఎయిర్పోర్టులో సెక్యూరిటీ సిబ్బంది ముమ్మర తనిఖీలు నిర్వహించారు.
శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ఇవాళ(ఆదివారం) బాంబు బెదిరింపు (Shamshabad Airport Bomb) చేశారు దుండగులు. బాంబు ఉందంటూ ఈమెయిల్ పంపించారు దుండగులు. ఈ నేపథ్యంలో ఎయిర్పోర్టులో సెక్యూరిటీ సిబ్బంది ముమ్మర తనిఖీలు నిర్వహించారు. అనంతరం ఎయిర్పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు అధికారులు. ప్రయాణికులను అప్రమత్తం చేశారు ఎయిర్పోర్టు అధికారులు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై తమకు వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు అధికారులు. ప్రయాణికులు ఎలాంటి ఆందోళనకు గురికావొద్దని పేర్కొన్నారు ఎయిర్పోర్టు అధికారులు.
కాగా, ఇటీవల కాలంలో పలు రాష్ట్రాల్లోని ఎయిర్పోర్టులకు దుండగులు మొయిల్స్ ద్వారా బెదిరింపులు చేస్తున్నారు. ఢిల్లీలోని పలు పాఠశాలలకు కూడా బెదిరింపు కాల్స్ చేసిన సంఘటనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారులు అలర్ట్ అయ్యారు. అసలు ఈ కాల్స్ ఎవరూ చేస్తున్నారనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. వరుసగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో జనం సామర్థ్యం ఉండే ప్రదేశాల్లో అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.