
KTR Slams Revanth on Fourth City
రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే ఫోర్త్ సిటీ.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ షాకింగ్ కామెంట్స్
ఫోర్త్ సిటీ కాదు.. ఉన్న సిటీని సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు. మెట్రోను రద్దు చేసి.. రేవంత్‌రెడ్డి ఫోర్త్ సిటీకి మెట్రో అంటున్నారని విమర్శించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) సంచలన వ్యాఖ్యలు చేశారు. హామీలపై కాంగ్రెస్ నేతలు దొంగమాటలు చెప్పి తప్పించుకుంటున్నారని ఆరోపించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని షేక్‌పేట సమతా కాలనీలో కేటీఆర్ ఇవాళ(ఆదివారం) పర్యటించారు. ఇంటింటికీ కాంగ్రెస్ ప్రభుత్వం బకాయి కార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.