
`మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బయోగ్రఫీ.
`యువతకు ఆదర్శంగా తెరకెక్కనున్న సినిమా.
`శీనన్న బాల్యం.. విద్యాబ్యాసం.
`శీనన్న పట్టుదల, కార్యదీక్ష..
`కష్టపడి జీవితంలో ఎదిగిన విధానం.
`ఉమ్మడి కుటుంబ వ్యవస్థ గొప్పదనం.
`వ్యాపారంలో ఆరంగేట్రం…
`సక్సెస్‌పుల్ పారిశ్రామిక వేత్తగా విజయం.
`ప్రజా జీవితం… రాజకీయం.
`ప్రజాసేవలో శీనన్న.
`ప్రజామోదంతో ఎన్నికల విజయాలు.
`వైసిపి తెలంగాణ అధ్యక్షుడి పాత్ర.
`ఆ ఎన్నికలలో విజయాలు.
`తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు.
`కాంగ్రెస్ పార్టీ కోసం శీనన్న కృషి.
`కాంగ్రెస్ విజయంలో శీనన్న పాత్ర.
`మంత్రిగా శీనన్న సంస్కరణలు.
`తన శాఖలలో విజయాలు.
`ఖమ్మం జిల్లా అభివృద్ధి.
హైదరాబాద్, నేటిధాత్రి:
రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బయోగ్రఫీతో కూడుకు న్న సినిమా శీనన్న తెరకెక్కనుంది. త్వరలో సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమా ఆధ్యంతం స్పూర్తిదాయకమైన ఒక వ్యక్తి జీవితం ఎలా వుంటుందో చూపించే ప్రయత్నం జరగ నున్నది. అంతే కాకుండా అటు సినీ నిర్మాణ విలుల తోపాటు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జీవితం మీద అధ్భుతమైన కధతో సినిమా తెరకెక్క నున్నది. ఎందుకంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జీవితంగా ఆదర్శ ప్రాయమైంది. ఆయన బాల్యం నుంచి మొదలు కొని, చదువు, కుటుంబ విలువలు, కుటుంబాన్ని నిలబెట్టిన తీరు, వ్యాపారం, ప్రజా సేవ, రాజకీయాలు, మంత్రిగా బాధ్యతలు, రాజకీయ పార్టీలలో ఆయన పోషించిన పాత్ర ఇలా అనేక రకాలైన డైమెన్షన్స్‌తో కూడుకున్న సినిమా నిర్మాణం జరగనున్నది. ఎందుకంటే ఆయన ఎలా కష్టపడి పైకొచ్చారు. జీవిత లక్ష్యం ఎలా నిర్ధేశించుకున్నారు. వ్యాపార రంగంలో ఎలా అడుగుపెట్టారు. అక్కడ ఎలా విజయాలు సాదించారు. చిన్న వయసులోనే ఆయన ఉన్నత స్దానానికి ఎలా చేరుకున్నారు. చేసే పనుల్లో ఆయనకు వుండే నిబద్దత వంటి అంశాలన్నీ మేళవించి వుంటాయి. ప్రజాసేవలో ప్రజలతో ఎలా మమేకయ్యారు. రాజకీయాల్లోకి ఎలా చేరుకున్నారు. ఆయన రాజకీయ ప్రస్తానంపై ప్రేక్షకులు, ప్రజలను ఆకట్టుకునే రీతిలో నిర్మాణం సాగనున్నది. సహజంగా ఒక వ్యక్తి ఎదిగిన తీరు కూడా ప్రజలకు ఆదర్శం కావాలి. అలా ఉన్నత విలువలు కలిగిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రాజకీయం గురించే చాల మందికి తెలుసు. కాని ఆయన ఎదిగిన విధానం, నిబద్దత ఎంత గొప్పది కూడా తెలియాల్సి వుంది. ఆయన నమ్మకం ఎంత బలమైంది. ఆయన నమ్మిన వారు ఎలా మోసం చేశారు? అనేది కూడా సినిమాలో చూపించే అవకాశాలున్నాయి. నిజం చెప్పాలంటే పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రాజకీయల్లోకి వచ్చే వరకు ఆయన ఎవరో అనేది ప్రపంచానికి పెద్దగా తెలియదు. కాని ఖమ్మం ప్రజలకు ఆయన గురించి తెలుసు. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అంటే ఎవరు? అనేది ప్రపంచానికి తెలిసింది. అది ఆయన చేసిన ప్రజా సేవ, రాజకీయాలు అంతగా గుర్తింపు తెచ్చాయి. అయితే సినిమాలో మాత్రం ఆయన ఎదుర్కొన్న రాజకీయ ఒడిదొడుకులు, ఆయన గెలిచిన తీరు మీద ఎక్కువ దృష్టిపెట్టాలని ఆయన అబిమానులు కోరుకుంటున్నారు. ఒక నాయకుడు రాజకీయాల వల్ల ఎలా ఇబ్బందుల పాలౌతాడన్నది కూడా సినిమాలో చూపించాల్సిన అవసరం వుంది. రాష్ట్రం విడిపోయిన తర్వాత పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వైసిపి పార్టీ నుంచి ఎలా గెలిచారు. ఎందుకు గెలిచారు? ఆయనపై ఖమ్మం ప్రజలకు వున్న నమకం ఏమిటి? ఎందుకు ఒక్కసారిగా రాజకీయంగా ఎలా దూసుకొచ్చారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎలా వచ్చారు. వచ్చి ప్రజలను ఎలా మెప్పించారు. అంతకు ముందు ఆయన ప్రజలకు ఎలా చేరువయ్యారు? అనేది కూడా చూపిస్తారని తెలుస్తోంది. వ్యాపార వేత్తగా వున్న ఆయన ప్రజలకు ఎలాంటి మేలు చేసేవారు. ఆపన్న హస్తం ఎలా అందించేవారు. పేదలను ఎలా ఆదుకున్నారు. అనే విషయాలు కూడా సినిమాలో వుండేలా ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే రాజకీయాల కన్నా, ప్రజలకు సేవ చేయడంలో శ్రీనన్న పొందే తృప్తి ఎలా వుంటుందన్నది అనేక సందర్భాలలో చూస్తూనే వున్నాయి. ఏ పల్లెటూరు లో ఏ కుటుంబంలో ఎలాంటి బాద వున్న ఎలా ఆదుకుంటారు. వారికి సమాచారం తెలిస్తే ఎలా సేవలంందిస్తారు అనేది కూడా సినిమా ద్వారా చూపించాలి. ఖమ్మం జిల్లాలో ఆయన ఎన్ని గుళ్లు, గోపురాలు నిర్మాణంలో పాలు పంచుకున్నారు. ఇలాంటి అనేక అంశాలు కూడా జోడిరచాల్సిన అసవరం వుందని అబిమానులు కోరుకుంటున్నారు. ఆయన ప్రజా సేవ ఒకెత్తైతే, రాజకీయం మరో ఎత్తు. తెలుగురాష్ట్రాల రాజకీయాల్లో తొడగొట్టి సవాలు చేసిన ఏకైక నాయకుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. బిఆర్ఎస్లో జరిగిన అన్యాయం మీద ఆయన ఎలాంటి సమాధానం చెప్పారు. బిఆర్ఎస్ను ఎదుర్కొని ఆయన ఎలా నిలబడ్డాడు. బిఆర్ఎస్ను ఖమ్మంలో నామరూపాలు లేకుండా ఎలా చేయగలిగారు. బిఆర్ఎస్ను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వనని శపధం చేసి మరీ ఓడిరచారు. ఇలా రాజకీయాలను శాసించే స్దాయికి ఎలా చేరుకున్నారన్నది కూడా సినిమాలో చూపిస్తే, గూస్ బంస్స్ రావాల్సిందే. ముఖ్యంగా పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రాజకీయాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే 2014లో ఖమ్మం ఎంపిగా వైసిపి తరుపున గెలిచారు. అప్పటికే ఆయన వైసిపికి రాష్ట్ర అధ్యక్షుడుగా వున్నారు. తనతోపాటు ఖమ్మంలో ఎమ్మెల్యేలను కూడా వైసిపి తరుపున గెలిపించిన నాయకుడు. అలాంటి నాయకుడిని కేసిఆర్ ఆహ్వానించారు. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సేవలు పార్టీకి అవసరమని చెప్పి , పార్టీలో చేర్చుకున్నారు. నిజానికి బిఆర్ఎస్లో చేరాలన్న ఆలోచన శ్రీనన్నకు లేదు. కాని తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన వైసిపీని వీడి బిఆర్ఎస్లో చేరారు. అయితే ఒక జిల్లాను శాసించే స్దాయి నాయకుడిని బిఆర్ఎస్లో చేర్చుకొని రాజకీయంగా బలహీనుడిని చేయాలని కేసిఆర్ అనుకున్నట్లు ముందు తెలియలేదు. కేవలం తెలంగాణ ప్రయోజనాల కోసం పొంగులేటి బిఆర్ఎస్లో చేరితే, పొంగులేటి రాజకీయాన్ని నాశనం చేయడానికి కేసిఆర్ చేర్చుకున్నారన్నది కొంత కాలానికి తేలిపోయింది. ఎంపిగా వున్న పొంగులేటిని పార్టీలో చేర్చుకొని ఆయనకు ప్రాదాన్యత తగ్గిస్తే చాలనుకున్నారు. కాని పొంగులేటిలో వుండే ఫైర్ ను తగ్గించలేరని తర్వాత బిఆర్ఎస్ తెలుసుకోవడమే కాదు, ఆ పార్టీయే నామ రూపాలు లేకుండాపోవడానికి కారణమైంది. 2018 ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదు. తర్వాత పార్లమెంటు ఎన్నికల్లోనూ పొంగులేటికి టికెట్ ఇవ్వలేదు. అలా పొంగులేటి ప్రాదాన్యత తగ్గించుకుంటూ వచ్చారు. ఖమ్మం జిల్లా రాజకీయాలలో పొంగులేటి పాత్ర లేకుండా చేయాలనుకున్నారు. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి లాంటి నాయకుడు ఎదిగితే బిఆర్ఎస్కు కష్టమే, నష్టమే అనుకున్నారు. అందుకే శ్రీనన్నను ఎదగుకుండా చేయాలని కుట్రలు చేశారు. ఎంతో ఓపికతో, సహసనంతో సీనన్న భరిస్తూ వచ్చారు. నోటి మీద చిరునవ్వు, నొసటి మీద ఎత్తిపొడుపు పెట్టుకొని, కేసిఆర్, కేటిఆర్‌లు రాజకీయం చేస్తున్నారని శ్రీనన్న తెలుసుకున్నారు. తనకు ప్రాధాన్యత లేకుండా చూడాలని అహర్నిషలు తాపత్రయ పడుతున్నారని తెలుసుకున్నాడు. అప్పుడు బిఆర్ఎస్ నుంచి బైటకు వచ్చారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ శ్రీనన్నను పార్టీలోకి ఆహ్వానించింది. అంతే కాంగ్రెస్ పార్టీ గెలుపుకోసం శ్రీనన్న చేసిన ప్రయత్నం అంతా ఇంతా కాదు. రాజకీయాలకే శ్రీనన్నను దూరం చేయాలని చూస్తే , రాజకీయాలను ఏలే దాకా ఎదిగారు. అనేవే ప్రధానాంశాలుగా సినిమా వుంటుంది. ఆయన బిఆర్ఎస్ను ఓడిరచేందుకు వేసిన ఎత్తులు, పన్నిన రాజకీయ వ్యూహాలను కూడా చాలా సినిమాటిక్‌గా చూపించే ప్రయత్నం చేయనున్నట్లు తెలుస్తోంది. ఎందకంటే బయోగ్రఫీ అంటే నాలుగు రీల్లు చుట్టేసినట్లు కాకుండా, శ్రీనన్న జీవితాన్ని రంగరించి తీసినట్లుగా వుండేలా ప్లాన్ చేస్తున్నారు. అప్పుడే సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారు. మరింత మంది చూసేందుకు వీలౌతుంది. బయోగ్రఫీ అనేది నిజాలకు చాలా దగ్గరగా, రియలిస్టిక్‌గా వుండాలి. తీయాలి. అప్పుడే ప్రేక్షకులు కూడా సినిమా చూసేందుకు వస్తారు. పైగా శ్రీనన్న జీవితం మీద తీస్తున్న సినిమా కావడం వల్ల రెండు రాష్ట్రాలలో నాయకుడిగా సినిమాను ఆదరించేలా వుండాలి. ఇ తర బాషల్లో ఒక నాయకు డి జీవితం ఎంత హృద్యంగా వుందని తెలిస్తేనే చూస్తారు.మొత్తానికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సినిమా పాన్ ఇండియా సినిమాగా తీస్తున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా, జాతీయ స్దాయిలో ప్రజ లు,నాయకులు కూడా చూసేలా వుంటుంది. జాతీయ స్దాయిలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గురించి చర్చికు నేలా సినిమా వుంటుందని తెలుస్తోంది. అప్పుడే శ్రీనన్న గొప్పదనం, రాజకీయం, పాలనా విధానం, ఆయన ఎదిగిన తీరు, ఎదుర్కొన్న ఒడిదొడుకులు, కాంగ్రెస్‌పార్టీకి అండగా నిలిచిన విధానం, కాంగ్రెస్‌ను గెలిపించిన తీరు అంతా సినిమాలో వుంటుంది. అప్పుడు జాతీయ స్దాయిలో ఇన్ని రాష్ట్రాలలో వున్న కాంగ్రెస్ నాయకులకు కూడా ఈ సినిమా ఆదర్శంగా కూడా నిలుస్తుంది. ఆల్‌ది బెస్ట్..పొంగులేటి!!