
Karakagudem JAC Leads Successful Joda Yatra
కరకగూడెం మండలం జేఏసీ ఆధ్వర్యంలో విజయవంతంగా జోడా యాత్ర
చట్టభద్దత లేని లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి
ఆదివాసీ 9 తెగల జేఏసీ రాష్ట్ర చైర్మన్ చుంచు రామకృష్ణ.
కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ..నేటిధాత్రి…
కరకగూడెం మండలం జేఏసీ ఆధ్వర్యంలో భారీ వర్షాన్ని లెక్కచేయకుండా మండల ఆదివాసీ జేఏసీ యువత ఉత్సాహంగా ఛలో భద్రాచలం ధర్మయుద్ధం బహిరంగ సభ జోడా యాత్రను విజయవంతంగా నిర్వహించారు. ఆదివాసి 9 తెగల రాష్ట్ర చైర్మన్ చుంచు రామకృష్ణ ఏడుళ్ళబయ్యారం క్రాస్ రోడ్ వద్దకు చేరుకోగానే కరకగూడెం మండల జేఏసీ తరఫున ఘన స్వాగతం పలికారు. కలవలనాగారం గ్రామంలో ఆదివాసీ మహిళలు సంప్రదాయ పద్ధతిలో మంగళహారతులు పట్టి, ఆదివాసీ 9 తెగల ఐక్య కార్యనిర్వహణ కమిటీ చైర్మన్ చుంచ రామకృష్ణ, విద్యార్థి సంఘం బట్టు వెంకటేశ్వర్లు లకు బొట్టు పెట్టి, కంకణం కట్టి, కొమరం భీం కు పూలమాలలు వేసి కొమరం భీం జోహార్లు అర్పించారు. అనంతరం చైర్మన్ రామకృష్ణ మాట్లాడుతూ. అక్రమంగా వలస వచ్చి ఎస్టీ రిజర్వేషన్ పొందుతు ఆదివాసుల హక్కులను దోచుకునే చట్టభద్దత లేని లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే వరకు ఉద్యమం ఆగదు ఈయొక్క ఆదివాసీ ల ధర్మ యుద్ధం భద్రాచలంలో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు ఆదివాసీలు అందరూ స్వచ్చందంగా తరలి వచ్చి సభను విజయవంతం చేయాలనీ తెలియజేశారు అనంతరం ర్యాలీ ఉత్సాహంగా కొనసాగింది. భట్టుపల్లి గ్రామంలో కొమరం భీం సెంటర్ వద్ద మండల ఉద్యోగ సంఘం నాయకులు తరఫున రామకృష్ణ గారికి పుష్పగుచ్చం సమర్పించారు. అక్కడ కొమరం భీంకు పూలమాలు వేసి కొమరం భీం జోహార్లు అర్పిస్తూ ఆయన ఆశయాలను,ప్రజలకు ఉద్యమ సందేశాన్ని అందించారు. కొర్నవల్లి గ్రామంలో యువత ఆధ్వర్యంలో కొమరం భీం గద్దె వద్ద శాలువా కప్పి చైర్మన్ ని సన్మానించారు.
అనంతరం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, చిరుమల్ల గ్రామంలోని సమ్మక్క సారలమ్మ గద్దె వరకు ర్యాలీగా వెళ్లి మొక్కలు చెల్లించుకున్నారు. అక్కడి ప్రజలను, పెద్దలను, యువతను, అందరినీ ఛలో భద్రాచలం ధర్మ యుద్ధ సభ కు స్వచ్ఛందంగా తరలిరావాలని పిలుపునిచ్చారు.అలాగే బర్లగూడెం, రఘునాథపాలెం, గ్రామాల్లోని సార్లమ్మ, గాదె రాజు, దేవతలను దర్శించి ర్యాలీని విజయవంతంగా కొనసాగించారు.ఈ జోడయాత్రతో కరకగూడెం మండలం ప్రజల్లో ఉత్సాహం, చైతన్యం నింపబడింది. సెప్టెంబర్ 28న జరగబోయే ఛలో భద్రాచలం ధర్మయుద్ధ సభను విజయవంతం చేయాలని అందరూ గట్టిగా సంకల్పించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంఘాల ఐక్యవేదిక (జేఏసీ)అధ్యక్షులు పోలేబోయిన వెంకటనారాయణ, ప్రధాన కార్యదర్శి కలం సాంబమూర్తి, వర్కింగ్ ప్రెసిడెంట్ చందా రామకృష్ణ, జేఏసీ నాయకులు కలం సంపత్, మాజీ సర్పంచులు పాయం నరసింహారావు, కొమరం విశ్వనాధం, ఉద్యోగ సంఘాల నాయకులు పోలేబోయిన కృష్ణయ్య, మలకం కుమారస్వామి, పోలేబోయిన మోహనరావు, మైపతి తిరుమలరావు, కొమరం అశోక్,పోలేబోయిన జయబాబు, విద్యార్థి సంఘ నాయకులు పోలేబోయిన స్వామిప్రసాద్, ఇర్ప నాగకృష్ణ, కళ్యాణ్, మాజీ ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.