
Konda Lakshman Bapuji Statue Unveiled in Bhupalpalli
కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం ఆవిష్కరణ
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
భూపాలపల్లి నేటిధాత్రి
బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి కోసం ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితాంతం కృషి చేశారని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పేర్కొన్నారు.శనివారం భూపాలపల్లి మంజూరునగర్ లోని పాత కలెక్టరేట్ కూడలిలో ఏర్పాటు చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహ ఆవిష్కరణకు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తో కలిసి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ తొలితరం ఉద్యమనాయకుడిగా, నిబద్దత కలిగిన గొప్ప రాజకీయవేత్తగా ఎంతో పేరు తెచ్చుకున్న బాపూజీ జీవితం భావితరాలకు ఆదర్శమన్నారు. బహుజన నేతగా పద్మశాలీలను సంఘటితం చేసేందుకు ఎంతో కృషి చేశారన్నారు. తెలంగాణ ఉద్యమం కోసం నాడు మంత్రి పదవికి కూడా రాజీనామా చేసి మలిదశ తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి కలిగించారని పేర్కొన్నారు. కలెక్టరేట్ లోని ఐడీవోసీ సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 110వ జయంతి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తో కలిసి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరయ్యారు. అనంతరం కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి కలెక్టర్ తో కలిసి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ అధికారి ఇందిర పిసిసి అధికార ప్రతినిధి గాజర్ల అశోక్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుపతి అప్పం కిషన్ అంబాల శీను ముంజల రవీందర్ పద్మశాలి కుల సంఘ నాయకులు ప్రసాద్ శ్రీధర్ శ్రీనివాస్ సతీష్ భాస్కర్ కార్యకర్తలు పాల్గొన్నారు