
Mittapalli’s Durga SriRam Kumar Tops Group 1 Exams
గ్రూప్ 1 లో రాణించిన మిట్టపల్లి వాసి
జైపూర్,నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన దుర్గం శ్రీరామ్ కుమార్ బుధవారం సాయంత్రం ప్రకటించిన గ్రూప్ 1 ఫలితాల్లో స్టేట్ (168) ర్యాంకు సాధించి (ఏఈఎస్) (డిఎస్పీ క్యాడర్) అసిస్టెంట్ ఎక్సైజ్ సూపర్డెంట్ పోస్టును దక్కించుకున్నారు.2019లో మొదట దుర్గం శ్రీరామ్ కుమార్ కు ఫారెస్టు డిపార్టుమెంట్ లో రేంజ్ ఆఫీసర్ గా ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది.ప్రస్తుతం అయన తాడ్వాయి డివిజన్ లో లింగాల రేంజ్ అధికారి గా పనిచేస్తున్నారు.శ్రీరామ్ కుమార్ గ్రూప్స్ లో ప్రతిభ కనబరిచి ఉన్నత స్థాయికి చేరుకున్నందుకు,ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పెద్ద పోస్టు రావడం పట్ల అటవీ శాఖలోని సిబ్బంది,గ్రామ ప్రజలు,బంధుమిత్రులు హర్షం వ్యక్తం చేశారు.