
Grand Celebration of Chakali Ailamma 130th Jayanti
చాకలి ఐలమ్మ 130వ జయంతి వేడుకలు
భూపాలపల్లి నేటిధాత్రి
చాకలి ఐలమ్మ 130 జయంతి వేడుకలను భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించడం జరిగింది చాకలి ఐలమ్మ ఓ సామాన్య స్త్రీ దొరలకు ఎదురు తిరిగింది. తనపై దాడి చేస్తే ప్రతిఘటించి, ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. తనపై తప్పుడు కేసులు బనాయించిన దొరలకు సవాల్ విసిరి కోర్టులో కేసు గెలిచి చరిత్ర సృష్టించింది. ఆమె చాకలి ఐలమ్మ అసలు పేరు చిట్యాల ఐలమ్మ తిరుగుబాటుకు స్ఫూర్తి ఐలమ్మ, బానిసత్వ సంకెళ్ల నుంచి శ్రామిక ప్రజలకు విముక్తి కలిగించిన వీరవనిత. దొరగడీలో గడ్డి మొలుస్తదని సవాలు విసిరి అచరణలో నిరూపించిన వీరనారి ఐలమ్మ నేటి ఆధిపత్య కుల సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై నిత్యం ఉద్యమించాలి.
రైతాంగ సాయుధ పోరాట యోధురాలు తన ఉద్యమ నేపథ్యంలో 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచడం జరిగింది ఐలమ్మ ఆశయాలు కొనసాగించాలి అని వారు అన్నారు ఈ కార్యక్రమంలో
చంద్రగిరిశంకర్ ఓరుగంటి ఐలయ్య,బొడ్డుపెల్లి మల్లేష్ , గడ్డం సమ్మయ్య
నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు