
"Teachers Excellence Honored"
నేషనల్ టీచర్స్ ఎక్సలెన్స్ అవార్డు
మహాదేవపూర్ సెప్టెంబర్ 26 నేటి ధాత్రి *
జయశంకర్ భూపాలపల్లి మహాదేవపూర్ మండల కేంద్రంలోని మహాదేవపూర్ బాలుర ఉన్నత పాఠశాలలో బయాలజీ టీచర్ బి ప్రభాకర్ రెడ్డి మరియు మహాదేవపూర్ బాలికల ఉన్నత పాఠశాలలో ఫిజిక్స్ టీచర్ మడక మధుఈ నేషనల్ టీచర్స్ ఎక్సలెన్స్ అవార్డులు తెలంగాణా ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఇటిక్యాల పురుషోత్తం చేతుల మీదుగా అందుకున్నారు.
విద్యార్థుల్లో ఇన్నోవేటివ్ అంశాలపట్ల ఆసక్తి పెంచుతూ, వినూత్న రీతిలో బోధనచేస్తున్న వీరి సేవలను గుర్తించి హైదరాబాద్ కు చెందిన శారద ఎడ్యుకేషనల్ సొసైటీ వీరిద్దరికి నేషనల్ టీచర్స్ ఎక్సలెన్స్ అవార్డు-2025 ప్రధానం చేశారు.ఈ అవార్డ్స్ ఈ కార్యక్రమంలో శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ నిర్వాహకులు శ్రీ పట్నం కమల్ మనోహర్,జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు శ్రీమతి మారం పవిత్ర, శ్రీమతి అర్చనపాల్గొన్నారు.ఈ అవార్డు పొందడం ఆనందంగా ఉందని అన్నారు.వీరిరువురిని మండల విద్యాధికారి శ్రీ బాల్నే ప్రకాష్ బాబు,బాలుర పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ అనిల్ కుమార్ మరియు బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి లు అభినందించారు.