
"BJP Leader Criticizes Congress for Failing Public Promises"
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం
ప్రధానమంత్రి మోడీ గారిని మరియు భారతీయ జనతా పార్టీ నీ విమర్శించే హక్కు కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేదు
భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కుందూరు మహేందర్ రెడ్డి
వర్ధన్నపేట( నేటిధాత్రి):
భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యం లోని కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ అభివృద్ధి పేద ప్రజల అభివృద్ధి తోనే సాధ్యమవుతుందని ఆలోచించి ప్రజలకు భారమైన జీఎస్టీ పన్నును నాలుగు స్లాబులుగా ఉన్నదాన్ని తగ్గి రెండు స్లాబుల కిందికి తీసుకువచ్చి నిత్యవసర వస్తువుల ధరలు తగ్గుముఖం పట్టే విధంగా ఆటోమొబైల్ పరిశ్రమలు ఫార్మా కంపెనీల లాభాలను తగ్గించి జిఎస్టిని తగ్గించడం ద్వారా పేదలకు న్యాయం జరుగుతుందని ఆలోచించి జిఎస్టి తగ్గిస్తే దానిని కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శించడం చాలా హాస్యస్పదంగా ఉందని భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కుందూరు మహేందర్ రెడ్డి అన్నారు. లేనిపోని మాటలు చెప్పి దొంగ హామీలు ఇచ్చి ఇచ్చిన హామీలను ఇప్పటివరకు నెరవేర్చలేక జనాల్లోకి పోయే ముఖం లేక కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రధానమంత్రి గారిని విమర్శించడం తగదని ఇప్పటికైనా ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా పనిచేయాలని కాంగ్రెస్ నాయకులకు హితవు పలికారు. మహిళలకు ప్రతి నెల 2500 ఇస్తామన్న హామీ ఇప్పటివరకు దరిదాపుల్లో కనపడడం లేదని గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకు ఇస్తామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు హామీని నెరవేర్చిన దిశగా వెళ్లలేదని ఆసరా పింఛన్లు డబల్ చేసి ఇస్తామని మోసం చేసి ఓట్లు ఎంచుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కళ్ళు మూసుకుపోయాయా అని ప్రశ్నించారు. వికలాంగులకు 6000 రూపాయలు పెన్షన్లు ఇస్తామని చెప్పి మోసం చేసిన కాంగ్రెస్ మళ్ళీ మాయమాటలు చెబుతూ ప్రజల్ని మోసం చేయాలని చూస్తుందని ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్తారని అప్పుడు వాళ్ళ పార్టీకి మరియు నాయకులకు కళ్ళు తెరుచుకుంటాయని అప్పటివరకు భ్రమలో కొనసాగాలని మహేందర్ రెడ్డి అన్నారు.