
"Demand for SC Reservation in Raghavareddypet"
ఏండ్లు గడిచిన ఎస్సీ రిజర్వేషన్ కు నోచుకొని రాఘవరెడ్డిపేట గ్రామం
గ్రామ పంచాయతీ పుట్టినప్పటి నుంచి ఎస్సీ రిజర్వేషన్ రాకుండా రాజకీయంగా దగా చేస్తుండ్రు.
దూడపాక శ్రీనివాస్ ఎమ్మార్పీఎస్ నాయకుడు డిమాండ్
భూపాలపల్లి నేటిధాత్రి
రాజకీయ పదవులు అనుభవించడానికి మేము అర్హులం కాదా..? పంచాయతీ రిజర్వేషన్లు కేటాయించే అధికారులు ఈసారైనా జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం రాఘవరెడ్డిపేట గ్రామ సర్పంచ్ ఎస్సీ రిజర్వేషన్ కు గ్రామాన్ని ఎన్నిక చెయ్యాలని
దూడపాక శ్రీనివాస్ మాదిగ ఎమ్మార్పీఎస్ నాయకుడు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
గ్రామ పంచాయతీ ఏర్పడినప్పటి నుండి ఇప్పటివరకు రాఘవరెడ్డిపేట గ్రామపంచాయతీ ఎస్సీ రిజర్వేషన్ కు నోచుకోలేదని, ఏండ్లు గడిచిన ఎందుకు ఎస్సీ రిజర్వేషన్ కేటాయించడం లేదని..? సర్పంచ్ ఎన్నికల్లో రాజకీయ పదవులు అనుభవించడానికి మేము అర్హులం కాదా..? రాజకీయంగా దగాకు గురవ్వడమేనా…? ఎన్నికల్లో పంచాయతీ రిజర్వేషన్లు కేటాయించే అధికారులు తేల్చాలనీ వారు అన్నారు
ఓట్లు వేసే యంత్రాలుగానే కాదు పరిపాలన వ్యవస్థలో భాగమై రాజకీయ పదవుల్లో సైతం అవకాశాలు రావాలని పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లను కేటాయిస్తే, మేము పుట్టక ముందు నుంచి ఇప్పటివరకు తరతరాలుగా ఎస్సీ రిజర్వేషన్ రావడం లేదంటే ఎంత అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. జనరల్ స్థానాలు వచ్చిన పోటీకి వచ్చే వారి కుల, ధన బలాలతో పోటీ పడే స్థాయిలో ఎస్సీ కులాల ప్రజలు లేరని, అందుకు ఈసారైనా పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లను తేల్చే అధికారులు తక్షణమే స్పందించి ఎండ్ల తరబడి జరుగుతున్న అన్యాయాన్ని గ్రహించి రాఘవరెడ్డిపేట గ్రామపంచాయతీకి ఎస్సీ రిజర్వేషన్ కేటాయించాలని డిమాండ్ చేశారు.
రాజకీయంగా అణిచివేతలే ఎదురైతే అభివృద్ధిలో కూడా అన్యాయమే జరుగుతుందని, వచ్చే నిధుల కానీ, సంక్షేమ అవకాశాలు మా వర్గాల ప్రజలకు అందకుండా పోతున్నాయని, మనల్ని గుర్తించే పరిస్థితే కనబడటం లేదని అన్నారు. అందుకు జిల్లా కలెక్టర్ ఆర్డీవో పంచాయతీ అధికారులు స్పందించి ఎస్సీ రిజర్వేషన్ వచ్చేలా మా గ్రామానికి సామాజిక న్యాయం జరిగేలా చూడాలని కోరారు.