"Demand for Phule Couple Statue"
మహాత్మా జ్యోతిరావు పూలే దంపతుల విగ్రహ ఏర్పాటు చేయాలి
బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ కు మరోసారి వినతిపత్రం
జిల్లా అధ్యక్షులు డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్
నర్సంపేట,నేటిధాత్రి:

వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో మహాత్మా జ్యోతిరావు పూలే దంపతుల విగ్రహ ఏర్పాటు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్ డిమాండ్ చేశారు.అందుకు గాను బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు,నర్సంపేట నియోజకవర్గ ఇంచార్జ్ డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్,కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా ఓబిసి చైర్మన్ ఓర్సు తిరుపతిల ఆధ్వర్యంలో సంఘం నాయకులతో కలిసి నర్సంపేట మున్సిపల్ కమిషనర్ భాస్కర్ కు మరోసారి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా డ్యాగల శ్రీనివాస్ మాట్లాడుతూ నర్సంపేట పట్టణంలోని నెహ్రూ పార్కు దగ్గర సెంట్రల్ బ్యాంక్ ఎదురుగా జ్యోతిరావు పూలే జంక్షన్ వద్ద గత కొన్ని సంవత్సరాలుగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పూలే దంపతుల జయంతి, వర్ధంతులతో పాటు పలు సామాజిక ప్రాధాన్యత కలిగిన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాని ఆ ప్రాంగణాన్ని జ్యోతిరావు పూలే జంక్షన్ గా నామకరణం చేయడం జరిగిందన్నారు. పూలే దంపతుల విగ్రహా ఏర్పాటు కోసం గత 2024 అక్టోబర్ 26 న మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం ఇచ్చాన్నారు.కాగా భవిష్యత్తు తరాలకు స్ఫూర్తినిచ్చే మహానీయులైన జ్యోతిరావు పూలే దంపతుల విగ్రహ స్ధాపన ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరినట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా కార్యదర్శి కురిమిల్ల రమేష్,జిల్లా యువజన సంఘం అధ్యక్షులు కడారి సురేష్ యాదవ్, చెన్నారావుపేట మండల అధ్యక్షులు బర్ల యాకయ్య, పట్టణ ఉపాధ్యక్షుడు మద్దెల శ్యామ్ కుమార్ యాదవ్, పట్టణ యూత్ అధ్యక్షుడు గోపగాని నాగరాజు గౌడ్, మంగిశెట్టి సారంగం, శీరంశెట్టి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
