
Annapurna Devi Blessings in Mogullapalli
అన్నపూర్ణ గా దర్శనమిచ్చిన అమ్మవారు ప్రత్యేక పూజలు నిర్వహించిన కట్కూరి సంధ్య-శ్రీధర్ దంపతులు*
మొగుళ్లపల్లి నేటి ధాత్రి:
ఆ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా చల్లగా ఉండాలని కోరుకుంటూ మొగుళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన కట్కూరి సంధ్య-శ్రీధర్ దంపతులు మండల కేంద్రంలోని సామూహిక శ్రీ సాంబశివ దేవాలయంలో కొలువైన దుర్గామాత అమ్మవారిని దర్శించుకొని..ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆ దంపతులు మాట్లాడారు. దుర్గామాత అమ్మవారి కృపాకటాక్షంలతో, ఆ తల్లి చల్లని దీవెనలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో, శాంతి సామరస్యంతో, అష్టైశ్వర్యాలతో, పాడి పంటలతో, పిల్లాపాపలతో నిండు నూరేళ్లు కలకాలం వర్ధిల్లాలని, ఆ అమ్మవారి దీవెనలు ప్రజలందరిపై నిత్యం ఉండాలని వేడుకున్నట్లు ఆ దంపతులు తెలిపారు. కాగా 3వ రోజున ఆలయ అర్చకులు భైరవ పట్ల వెంకటేశ్వర శర్మ అమ్మవారిని పట్టు వస్త్రాలతో అలంకరించారు. అనంతరం దుర్గామాత అమ్మవారు అన్నపూర్ణాదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. పూజా కార్యక్రమం అనంతరం అమ్మవారి భక్తులు తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో శివరామకృష్ణ భజన మండలి సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.