
Millets Bring Profits to Farmers
చిరుధాన్యాల సాగుతో రైతులకు అధిక లాభాలు: బాలరాజ్
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్లో జరిగిన డిడిఎస్ రైతు సదస్సులో సంగారెడ్డి జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు బాలరాజ్ పాల్గొన్నారు. చిరుధాన్యాలు పండించడం ద్వారా రైతులకు అధిక లాభాలు వస్తాయని, ఆర్థికంగా ఎంతో ఉపయోగకరమని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో డిడిఎస్ సభ్యులు ప్రొఫెసర్ వరప్రసాద్, వ్యవసాయ అధికారి బిక్షపతి, మాణిక్యము, రైతు సంఘం సభ్యులు, వ్యవసాయ రంగ ప్రతినిధులు పాల్గొన్నారు.