
Yadav Leaders Warn After Attack on Mahesh
మహేష్ పై దాడి చేసిన వారికి ప్రజల సమక్షంలో పతనం తప్పదు.
యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మేకల రాములు యాదవ్.
చిట్యాల, నేటిధాత్రి :
పంచకం మహేష్ యాదవ్ కుటుంబం పై దౌర్జన్యంగా దాడి చేయించిన పులి అంజిరెడ్డి తిరుపతిరెడ్డి కి ప్రజల సమక్షంలో పతనం తప్పదని యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మేకల రాములు యాదవ్ అన్నారు.చిట్యాల మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో సోమవారం జాతీయ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మేకల రాముల యాదవ్ యాదవ సంఘం నాయకులతో కలిసి మాట్లాడుతూ మండలంలోని కాలువ పల్లి గ్రామానికి చెందిన పంచిక స్రవంతి మహేష్ యాదవ్ ల కుటుంబంపై దౌర్జన్యంగా దాడి చేయించి గాయపరిచిన మాజీ జెడ్పిటిసి పులి తిరుపతిరెడ్డి,కాల్వపల్లి సర్పంచ్ అంజిరెడ్డిలు పంచిక మహేష్ భూమిలో ఎలాంటి అనుమతి లేకుండా మహేష్ కు తెలియజేయకుండా తెల్లారేసరికి అక్రమంగా దేవాలయ నిర్మాణం చేపట్టగా ఇదేమిటని మర్యాదపూర్వకంగా అడుగగా వారిపై దాడి చేయించడం పులి అంజిరెడ్డి కుటుంబానికి ఆప్రజాస్వామ్యమని జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు రాములు యాదవ్ మండిపడ్డారు. పంచకం మహేష్ యాదవ్ బిజెపి పార్టీ నుండి రాజకీయంగా ఎదుగుతున్నాడని కక్షతో ఆ ఊరి నుండి మహేష్ ను వెల్లగొట్టాలని నీచమైన ఆలోచనలతో పులి కుటుంబం మహేష్ ను రాజకీయంగా ఎదుగుదలను ఓర్వలేక దౌర్జన్యంగా దాడులకు, బెదిరింపులకు పాల్పడుతూ నీచమైన ఆలోచనలతో మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్న వారిని జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి వదిలిపెట్టదన్నారు.ఇప్పటికైనా మహేష్ కుటుంబం పట్ల మీ నీచ రాజకీయాలు మానుకోకపోతే కాల్వపల్లికి గ్రామానికి రాష్ట్రంలోని యాదవులమందరం ఏకమై నీ ఇల్లును ముట్టడిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు కొక్కుల దేవేందర్ యాదవ్, రాష్ట్ర కార్యదర్శి జక్కుల రాములు యాదవ్, కరీంనగర్ జిల్లా యాదవ సంఘం అధ్యక్షులు బండి మల్లేష్ యాదవ్, జంగా కొమురయ్య, చంద్రశేఖర్, సతీష్, శ్రీశైలం, సంపత్, దిలీప్,యాదవులు తదితరులు పాల్గొన్నారు.