
Devi Navaratri Celebrations in Jeheerabad
దేవి నవరాత్రుల ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాలలో పాల్గొన్న
◆:- టి ఆర్ పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జ్యోతి పండాల్
జహీరాబాద్ నేటి ధాత్రి;
దేవి నవరాత్రుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ఎక్కిలి హిందు సేవా సమితి వారు నిన్న రాత్రి జహీరాబాద్ టౌన్ లో దేవి విగ్రహాన్ని స్థాపించి హోమ కార్యక్రమాలు మరియు వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఎక్కిలి హిందు సేవా సమితి వారి ఆహ్వానం మేరకు నిన్న రాత్రి పూజా కార్యక్రమంలో జ్యోతి పండాల్ పాల్గొని దేవి దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిఆర్పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జ్యోతి పండాల్, టిఆర్పి కార్యదర్శి రమేష్ , ఎక్కిలి హిందూ సేవా సమితి కమిటీ సభ్యులు సురేష్ పూరి, పూల సంతోష్, సుదీర్ బండారి, టిఆర్పి సభ్యుడు జగన్, పద్మశాలి సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.