
`దశాబ్దాలుగా సాగుతున్న నీటి దోపిడీ.
`పదే పదే ఎత్తు పెంచుకుంటూ పోతున్నారు.
`కేంద్రంలో కాంగ్రెస్ వున్నంత కాలం ఇదే జరిగింది.
`మళ్ళీ నీటి దోపిడికి కర్ణాటక తెగబడుతోంది.
`ఆల్మట్టి వివాదంపై అప్పట్లో సినిమాలలో సెటైర్లు.
`ఆల్మట్టి ఆపడంలో చంద్రబాబు విఫలం.
`ఆ రోజుల్లోనే తెలంగాణకు తీరని అన్యాయం.
`మళ్ళీ ఇప్పుడు మరో సారి ఆల్మట్టి పెంపుకు ప్రయత్నం.
`ఇప్పుడు అడ్డుకోకపోతే తెలంగాణకు తీరని అన్యాయం.
`దక్షిణ తెలంగాణ ఎడారి కావడం ఖాయం.
`కర్ణాటక ప్రభుత్వం క్యాబినెట్ తీర్మానం చేసి రెండు నెలలలౌతోంది.
`తెలంగాణ ప్రభుత్వం మౌనం వహించింది.
`మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు కు వెళ్తానంటోంది.
`తెలంగాణ ప్రభుత్వం స్పందించకోపోతే దక్షిణ తెలంగాణ ఎడారే అవుతుంది.
`ఇప్పటికే కృష్ణా నదిలో అన్యాయం జరుగుతోంది.
`పెండిరగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తే నీళ్లు సరిపోవు.
`మరో వైపు పోతిరెడ్డిపాడు తో దశాబ్దాలుగా నష్టం జరుగుతోంది.
`తెలంగాణకు మంచి నీళ్లకు దిక్కు లేదు.
`చెన్నై కి మంచినీటిని తరలించిన ఉమ్మడి పాలకులు.
`తెలుగు గంగ పేరుతో తమిళనాడుకు నీళ్లిచ్చారు.
`రాయలసీమకు నీళ్లు తరలించారు.
`తెలంగాణ ప్రాజెక్టులు పెండిరగ్లో పెట్టారు.
`ఆర్డీస్ తూములు పగులగొట్టి మరీ నీళ్లు తరలించుకున్నారు.
`ఇప్పుడు మళ్ళీ కర్ణాటక ఆల్మట్టి ఎత్తు పెంచితే తెలంగాణకు చుక్క రాదు.
`నికర జలాలకు దిక్కు లేదు.
`వరద జలాలు ఇక్కడిదాకా వచ్చే అవకాశమే లేదు.
హైదరాబాద్, నేటిధాత్రి:
ఇప్పుడు మేలుకోకపోతే ఎడారి పాలౌతాం. పాలమూరుతోపాటు దక్షిణ తెలంగాణ ఆగమౌతుంది. మరోసారి అప్పర్ కృష్ణ మీద ఆల్మట్టి పెంపుకోసం కర్నాకట ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అంటే దిగువ రాష్ట్రాల మీద కుట్ర చేస్తున్నట్లే లెక్క. ముఖ్యంగా తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఆల్మట్టి పెంపు వల్ల ఏపికి పెద్ద నష్టం లేకపోయినా తెలంగాణకు మాత్రం తీవ్ర అన్యాయం జరుగుతుంది. అప్పర్ కృష్ణాలో ఎన్ని ప్రాజెక్టులు కట్టుకున్నా రెండు తెలుగు రాష్ట్రాల వరకు వచ్చే సరికి దామాషా అంటూ లెక్కలు కడతారు. అప్పుడు కూడా తెలంగాణకు అన్యాయమే మిగులుతుంది. కృష్ణ మీద తెలంగాణలో ప్రాజెక్టులు కడితే ఏపికి నీళ్లు అందలేవన్న ఒకే ఒక్క కారణం చేతనే ఉమ్మడి పాలకులు నిర్మాణాలు చేయలేదు. కృష్ణా నదీ నీళ్లన్నీ ఏపికి తరలించేందుకే ఉమ్మడి రాష్ట్రంలో తీరని అన్యాయంచేశారు. అటు శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు మొదలు పెట్టి నీళ్లు తీసుకెళ్లడం మొదలు పెట్టారు. వరద జలాల పేరుతో పోతిరెడ్డి పాడును 44వేల క్యూసెక్కుల లెక్క చెప్పారు. దాన్ని పెంచుకుంటూ పెంచుకుంటూ 88వేల క్యూసెక్కులు చేసుకున్నారు. కాని ఏనాడు తెలంగాణ పెండిరగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలన్న ఆలోచన చేయలేదు. ఎందుకంటే దక్షిణ తెలంగాణకు ఏకైక వర ప్రదాయిని కృష్ణ మాత్రమే. మూసీ లాంటి చిన్న చిన్న నదులు, వాగులున్నా అవి కృష్ణాలో కలిసినా పెద్ద ప్రయోజనం ఏమీ వుండదు. తెలంగాణ ఎక్కువ భాగం కృష్ణా బేసిన్లోనే వుంటుంది. తెలంగాణ మీదుగానే ప్రయాణం చేస్తుంది. అయినా ఇప్పటి వరకు కృష్ణా నీటిని సమృద్దిగా తెలంగాణ ఏనాడు వాడుకున్నది లేదు. పైగా బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం ఉమ్మడి రాష్ట్రంలోనే ఏపికి 519 టిఎంసిలు, తెలంగాణకు 291 లెక్క లేల్చారు. నీటి వాటాలు పంచారు. కాని పెండిరగ్ ప్రాజెక్టులు పూర్తి చేయలేదు. ఆ 291 టిఎంసిలు కూడా ఇవ్వలేదు. నీళ్లన్నీ ఏపికి తరలించుకుపోయారు. నాగార్జున సాగర్‌లో ఎడమ కాలువను ఎప్పుడూ ఎండబెట్టేవారు. కుడి కాలువ ద్వారాఏపికి నీళ్లు తరలించుకుపోయేవారు. ఏపికే కాదు, చెన్నై నగరానికి కూడా నీళ్లించేందుకు ఉమ్మడిరాష్ట్రంలో తెలుగు గంగ పేరు 1500 కిలోమీటర్ల మేర కాలువ తవ్వారు. ఉమ్మడి రాష్ట్ర నిధులతో చెన్నైకి నీరు తరలించారు. కాలువ నిర్మాణానికి తమిళనాడు ఖర్చు భరించుకున్నదని మభ్య పెట్టారు. మధ్యలో అనేక ఎత్తిపోతల పథకాల ప్రాజెక్టులు నిర్మాణం చేసుకున్నారు. ఏకంగా 65 టిఎంసిల సామార్ధ్యంతో కూడిన రిజర్వాయర్లు నిర్మాణం చేసుకున్నారు. అలా ఉమ్మడి రాష్ట్రంలోనే ఏపిలో సుమారు 15కు పైగా కేవలం కృష్ణా నది నీటి కోసమే రిజర్వాయర్లు నిర్మాణం చేసుకున్నారు. కాని తెలంగాణకు మంచినీళ్లిచ్చేందుకు ఉమ్మడి పాలకులకు మనసు రాలేదు. తెలంగాణ వచ్చినా కృష్ణా నది నీళ్లను ఇంకా వినియోగించుకునే అవకాశం రావడం లేదు. పైగా ఉరుము లేనిపిడుగులాగా ఎప్పుడో ఆగిపోయిన ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచుకోవడం కోసం కర్నాటక ప్రభుత్వం క్యాబినేట్ తీర్మానం చేసకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది జరిగి కూడా రెండు నెలలు గడుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు నెలల కాలం నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందన్న ప్రశ్న సహజంగానే ఉత్పన్నమౌతోంది. కర్నాకట రాష్ట్ర ప్రభుత్వం ఈ తీర్మానం చేసిన వెంటనే మహారాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఆల్మట్టి డ్యామ్ పెంపు ఆలోచనను విరమించుకోవాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవెంద్ర ఫడ్నవీస్ డిమాండ్ చేశారు. కర్నాటక ప్రభుత్వం వెనక్కి తగ్గకుండా ముందుకెళ్తే సుప్రింకోర్టును ఆశ్రయిస్తామని కూడా హెచ్చరించారు. నిజానికి ఆల్మట్టి ప్రారంభించిన సమయంలో కేవలం 126 మీటర్ల ఎత్తు వరకే నిర్మాణం చేసుకోవాలని అప్పట్లో సుప్రింకోర్టు తీర్పునిచ్చింది. కాని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 519 మీటర్లకు వరకు కూడా అనుమతినిచ్చింది. దాంతో కర్నాకట ప్రభుత్వం ఆల్మట్టిని 519 మీటర్ల ఎత్తుకు నిర్మాణం చేసుకున్నది. ఆ నిర్మాణం మూలంగా ఇప్పటికే కృష్ణానదిలో నీళ్లు లేకుండాపోతున్నాయి. ఆల్మట్టి డ్యామ్ పూర్తిగా నిండితే తప్ప దిగువకు నీళ్లు వచ్చే పరిసి ్దతి లేకుండాపోయింది. 519 మీటర్ల ఎత్తుతో ఆల్మట్టి డ్యామ్‌లో ఎప్పుడూ 129 టిఎంసిల నీరు నిలువ వుంటోంది. ఇప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వం మరో 5 మీటర్లు ఎత్తుతో 524 మీటర్ల నిర్మాణం చేపడితే తెలంగాణ ఎడారి కావడం ఖాయం. ఆ 5 మీటర్ల ఎత్తు పెంచుకోవడం వల్ల ఇప్పుడు నిలువ వుండే నీటికన్నా ఎక్కువ నీటి సామార్ధ్యం అమాతంతం సగానికి పైగా పెరుగుతుంది. అంటే ప్రస్తుతం వున్న 129.5 టిఎంసిలకు తోడు అదనంగా మరో 130 టిఎంసిల నీరు నిలువ సామార్ధం పెరుగుతుంది. మొత్తం 300 టిఎంసిల నీరు వరకు నిలువ చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. అందుకోసం కర్నాటక ప్రభుత్వం రూ.70 వేల కోట్లు కేటాయించినట్లు కూడ తెలుస్తోంది. అయితే ఆల్మట్టి ఎత్తు నిర్మాణంలో మహారాష్ట్రకు పెద్దగా అభ్యంతరం లేదనే చెప్పాలి. ఎందుకంటే మహారాష్ట్రకు నీటి విషయంలో వచ్చే నష్టమేమీలేదు. కాకపోతే మహారాష్ట్రలోని రెండు జిల్లాలు ముంపుకు గురౌతాయి. అందుకు కర్నాకట పరిహారం అడిగినంత చెల్లించేందుకు రెడీ అంటోంది. దాంతో బ్యాక్ వాటర్ వల్ల మహరాష్ట్రంలోనూ భూగర్భ జలాలు పెరుగుతాయి. ముంపు ప్రాంతాల ప్రజలకు పరిహారం కూడా అందుతుంది. అయినా మహారాష్ట్ర ఒప్పుకునే ప్రసక్తి లేదని తేల్చి చెబుతోంది. ఆల్మట్టి 5 అడుగులు పెంపు వల్ల తెలంగాణ మొత్తం ఎడారిగా మారిపోతుంది. నారాయణపూర్‌కు చుక్క నీరు కూడా రాదు. నీటి విషయంలో కాంగ్రెస్ సర్కారు ఒకింత ఉదాసీనతతో వ్యహరిస్తుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆల్మట్టి అనేది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం వున్నప్పుడే ఈ వివాదాలు రేగుతున్నాయి. గతంలో పదేళ్లపాటు బిజేపి ప్రభుత్వం వున్నప్పుడు ఈ వివాదం తెరమీదకు రాలేదు. అసలు గతంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం వున్నప్పుడే 524 మీటర్ల ఎత్తుకు పెంచుకునే ప్రయత్నం బాగానే చేశారు. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం ప్రబుత్వం వుంది. అయినా అప్పటి కాంగ్రెస్ నాయకుడు దివంగత పి. జనార్ధన్‌రెడ్డి తీవ్రంగా కొట్లాడారు. అప్పుడు కర్నాకటకలో కాంగ్రెస్ ప్రభుత్వమే వుంది. ఎస్ఎం.కృష్ణ ముఖ్యమంత్రిగా వున్నారు. ఆ సమయంలో కాంగ్రెస్ నాయకుడైనా సరే పి. జనార్ధన్‌రెడ్డి తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాటం చేశారు. ఆల్మట్టి ఎత్తు పెరగకుండా పెద్దఎత్తున కాంగ్రెస్ పార్టీ మీద ఒత్తిడి తెచ్చారు. అప్పుడు కాంగ్రెస్ కూడా తలొగ్గింది. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ పార్టీ కర్నాకటలో అధికారంలోవుంది. తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీయే అధికారంలో వుంది. ఇదే మంచి సమయం అనుకొని కర్నాకట సిద్దరామయ్య సర్కారు ఆల్మట్టి ఎత్తు పెంచుకునేందుకు సన్నహాలు చేస్తున్నారు. కాని తెలంగాణ ప్రభుత్వం ఇంతవరకు మేలుకోలేదు. కనీసం ఆ ఎత్తు ప్రక్రియపై ఇంత వరకు స్పందించలేదు. తాజాగా బి ఆ ర్ఎస్ నాయకులు ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. ఇప్పటికే రేవంత్ సర్కారు గోదావరి నీటిపై విమర్శలు ఎదుర్కొంటున్నారు. అటు బిఆర్ఎస్ నుంచే కాకుండా కొంత మంది కాంగ్రెస్ నాయకులు కూడా గోదావరి నీటిపై స్పందించారు. బనచర్ల పేరుతో ఏపి ప్రభుత్వం వరద జలాలలో 80 టిఎంసిలు వాడుకునేందుకు సిద్దమైంది. బనక చర్ల విషయంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పట్లో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. కృష్ణాలో 500 టిఎంసిలు, గోదావరిలో 1000టిఎంసిలు వదిలేసి మిగిలిన నీళ్లను వాడుకోండంటూ ఏపికి సూచించారు. ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఆ వివాదం చిలిచి చిలికి గాలివాన కావడంతో బనకచర్లపై రాష్ట్ర ప్రభుత్వం కొంత గట్టిగా నిలబడే అవకాశం దక్కింది. అయినా ఆ సమస్య ఇంకా కొలిక్కి రాలేదు. ఏపిలో చంద్రబాబు ఆ ప్రతిపాదన మానుకోలేదు. దానిపై ముందుకు వెళ్లేందుకే సిద్దంగావున్నారు. ఆ ప్రణాళికలు చేస్తూనే వున్నారు. ఇప్పుడు కృష్ణా నదిమీద ఆల్మట్టి డ్యామ్ పెంపు ప్రతిపాదనలు తెరమీదకు వచ్చాయి. అప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. ఎలాంటి ప్రకటనచేయలేదు. ఎట్టిపరిస్ధితుల్లోనూ ఆల్మట్టి డ్యామ్ నిర్మాణాన్ని ఒప్పుకునే ప్రసక్తి లేదని రేవంత్ సర్కార్ గట్టిగా నిలబడితే తప్ప ఆగదు. తెలంగాణ ఎడారి కాక మానదు. చూద్దాం ఏంజరుగుతుందో!!