
Bhupalpalli MLA Visits Kaleshwar Mukteshwar Swamy Temple
కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆశీస్సులు ప్రజలపై ఉండాలి
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
భూపాలపల్లి నేటిధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారిని శనివారం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పద్మ దంపతులు దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, అధికారులు వేదమంత్రోచ్చరణల నడుమ స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే దంపతులు కాలేశ్వరం ముక్తేశ్వర స్వామిని దర్శించుకుని అభిషేకం నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు ఫణీంద్ర శర్మ వారి అర్చక బృందం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తదనంతరం వేద ఆశీర్వచనం వేదికపై ఫణీంద్ర శర్మ అయ్యవారు శేష వస్త్రాలతో ఎమ్మెల్యే దంపతులకు సన్మానం చేసి ఆశీర్వదించి, స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేశారు.