
Siricilla Collector Directs Completion of SIR Preparations by Sept 23
సెప్టెంబర్ 23 లోపు ఎస్.ఐ.ఆర్ సన్నదత పనులు పకడ్బందీగా పూర్తి చేయాలి
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ
స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ పై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్
సిరిసిల్ల టౌన్:(నేటిధాత్రి)
ఈరోజు సిరిసిల్ల జిల్లాలో సెప్టెంబర్ 23 లోపు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్.ఐ.ఆర్ ) సన్నద్దత పనులు పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై శనివారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సమీకృత జిల్లా కలెక్టరేట్ మినీ సమావేశ మందిరం లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ..ఎస్.ఐ.ఆర్ నిర్వహణ కంటే ముందు ప్రతి పోలింగ్ బూత్ స్థాయిలో 2002 ఎస్.ఐ.ఆర్ డేటా ను 2025 ఎస్.ఎస్.ఆర్ డేటా తో కంపేర్ చేసుకోవాలని ఈ రెండు జాబితాలో కామన్ గా ఉన్న పేర్లు మినహాయించి 2002 తర్వాత ఓటరుగా నమోదైన వారి వివరాలను క్షేత్రస్థాయిలో మరోసారి ధృవీకరించాల్సి ఉంటుందని అన్నారు.
ఎన్నికల కమిషన్ నిర్దేశించిన ప్రోఫార్మా ప్రకారం ఎస్.ఐ.ఆర్ సన్నద్దత రిపోర్టు తయారు చేయాలని, ఎస్.ఐ.ఆర్ సంబంధించి డెస్క్ వరకు సెప్టెంబర్ 23 నాటికి పూర్తి చేయాలని అన్నారు.
పోలింగ్ కేంద్రాల వారిగా ప్రస్తుత ఓటర్ జాబితా, 2002 ఎస్.ఐ.ఆర్ లో ఉన్న ఓటర్ల కామన్ డెటాతో కెటగిరి ఏ, 2002 ఎస్.ఐ.ఆర్ లో నమోదు కాకుండా 1987 కంటే ముందు జన్మించిన ఓటర్లతో కేటగిరి బి, పుట్టిన సంవత్సరం 1987 నుంచి 2004 మధ్యలో ఉంటే కేటగిరి సి,2004 తర్వాత ఉంటే కేటగిరి డీ కింద పరిగణించి బూత్ స్థాయి అధికారులు రిపోర్టును సెప్టెంబర్ 23 లోపు సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.ఈ సమావేశంలో సిరిసిల్ల వేములవాడ రెవిన్యూ డివిజనల్ అధికారులు వెంకటేశ్వర్లు రాధాబాయి అన్ని మండలాల తాసిల్దారులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.