Petition Submitted for Asara Pension Hike in Odel
ఆసరా చేయుత పింఛన్లు పెంపుదల అమలుకై వినతి పత్రం అందజేత
ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిదాత్రి:
ఓదెల మండలం పోత్కపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి కి ఎమ్మార్పీఎస్, వి హెచ్ ఎస్, సి పి హెచ్ పి ఎస్, ఎం ఎస్పి, ఆధ్వర్యంలో పింఛన్లు పెరుగుదల కోసం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర వాప్తంగా ‘ఆసరా చేయూత పెన్షన్లు’ పెంచి అమలు చేయాలని నిరసన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం సీఎం శ్రీ రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని విన్నవిస్తూ డిమాండ్ చేస్తున్నాము. ఎన్నికల మేనిఫెస్టోలో తెలిపినట్లుగా వృద్ధాప్య, వితంతువు పెన్షన్లతో పాటు రూ॥ 2000/- ఉన్న ఆసరా పెన్షన్ రూ॥ 4000/- మరియు రూ॥ 4000/- ఉన్న పెన్షన్ రూ॥ 6000/- డయాలసిస్, కండరాల క్షీణత వ్యాధిగ్రస్తులకు రూ॥ 15000/- పెంచి ఇవ్వాలని అలాగే కొత్తగా దరఖాస్తు చేసుకున్న అర్హులైన లబ్దిదారులకు పెన్షన్ మంజూరు చేసి, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని తెలుపుతున్నాను. ఈ విషయమై పెన్షన్‌దారుల పక్షాన ఎమ్మార్పీఎస్, వి హెచ్ పి ఎస్, సీపీ హెచ్ పి ఎస్, ఎం ఎస్ పి అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మార్వోలకు వినతి పత్రాలు సమర్పించడం జరుగుతుందని అన్నారు.
కావున తమరు పై విషయాలను పెద్దమనసుతో పరిశీలించి సానుకూలంగా స్పందించి, సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఆసరా చేయూత పెన్షన్ పెంచి, తక్షణమే అమలు చేసి, లబ్దిదారులకు అందించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు శనిగరపు కుమార్ ఇన్చార్జ్ అంబాల పోశాలు కో ఇన్చార్జ్ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు
