
SP Inspires Students to Excel with Discipline
విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి జిల్లా ఎస్పీ
రావుల గిరిధర్
వనపర్తి నేటిదాత్రి .
విద్యార్థులు ఓపిక తో చదివి జీవితంలో ఉన్నత స్థానంలో నిలవాలని
తల్లిదండ్రులు గర్వపడే స్థాయికి విద్యార్థులు ఎదగాలని జిల్లా ఎస్పీ రావుల గీరీదర్ కోరారు
శుక్రవారం పెద్దమందడి ప్రాథమిక పాఠశాలలో విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థులు సహకారంతో పాఠ్య పుస్తకాలలో ఉన్న విజ్ఞాన భాండాగారాన్ని పిల్లల్ని ఆకర్షించే విధంగాతరగతి గదులకు కార్టూన్లు, సైంటిస్టుల చిత్రాలతో పెయింటింగ్ వేయించారు విద్యార్థిని విద్యార్థులకు బూట్లను పంపిణీ చేశారు జిల్లా.ఎస్పీ రావు ల గీ రీ ద ర్ కు విద్యార్థులు స్వాగతం తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ… బాలలకు తరగతి గదిలోనే ఉజ్వలమైన భవిష్యత్తు ఉందఅన్నారు. ప్రజలకు చట్టాలు, శిక్షలు సప్రవర్తన పై అవగాహన కల్పిస్తున్నాం అని తెలిపినారు.
విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ కష్టపడి చదివి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, మాతృభూమికి మంచి పేరు తేవాలి, ప్రజలకు సేవలు అందించే విధంగా ఎదగాలి అన్నారు. చాలా సంత్సరాల క్రితం చదువుకోవడానికి సరియైన వసతులు లేవు ఇప్పుడు పరిస్తితి మారినది ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో అన్ని మౌలిక వసతులు కల్పించి ఉన్నతమైన నాణ్యమైన సాంకేతిక విద్య అందిస్తుంది అన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు నైపుణ్యంతో విద్యను బోధిస్తున్నారని ఎస్పీ తెలిపారు
ఈ కార్యక్రమంలో పెద్దమందడి విద్యాశాఖ అధికారి,మంజులత, పెద్దమందడి ఎస్సై శివకుమార్ ఏసీ టి ఓ ప్రసన్నరెడ్డి, ప్రధానోపాధ్యాయులు, బండి శ్రీనివాసులు, ఉపాధ్యాయులు శ్రీనివాస్, రోజా రాణి, కిరణ్ కుమార్, సుచిత్ర, ఈశ్వర్, మధు, పాఠశాల, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.