
MLA Nayini Promises Support for Students
గిరిజన సంక్షేమ అధ్యాయాన కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే నాయిని…
#విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలు,విద్యా బోధన గురించి ఆరా…
#గ్రూప్స్ ప్రిపరేషన్ లో ఉన్న విద్యార్థులందరికీ సొంత ఖర్చులతో మెటీరియల్ ఇస్తానని హామీ…
#ప్రభుత్వ విద్యా వైద్యం వ్యవసాయం కోసం ప్రత్యేక దృష్టి సారించింది.
#మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు సిద్ధంగా ఉంటానని భరోసా అందించిన ఎమ్మెల్యే నాయిని…
హన్మకొండ, నేటిధాత్రి:
హనుమకొండలోని బాలసముద్రం గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎంపీటీసీ (మల్టీ పర్పస్ ట్రైనింగ్ సెంటర్) ను శుక్రవారం ఎమ్మెల్యే శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి సందర్శించారు. కేంద్రంలో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, బోధనా ప్రమాణాలపై సమీక్ష జరిపారు. గ్రూప్స్ ప్రిపరేషన్ చేస్తున్న విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడి వారి అవసరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూగ్రూప్స్ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులందరికీ నేను స్వయంగా ఖర్చు భరించి అవసరమైన స్టడీ మెటీరియల్ అందజేస్తానని అని హామీ ఇచ్చారు. విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తూ ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు.కేంద్రంలో మరిన్ని ఆధునిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే నాయిని భరోసా ఇచ్చారు. అవసరమైతే ప్రభుత్వ స్థాయిలో పీటిషన్లు పెట్టి సౌకర్యాలు పొందేందుకు చర్యలు తీసుకుంటానని తెలిపారు.ఉమ్మడి జిల్లా నుంచి ప్రత్యేకంగా విద్యానభ్యసించడానికి వచ్చిన విద్యార్థులకు భరోసా ఇచ్చారు.ఇంటర్ విద్యార్థులను కలిసి మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారిని ప్రేమకల,ప్రిన్సిపాల్ శ్రీరాములు,అధ్యాపకులు,సిబ్బంది పాల్గొన్నారు.