
Health Camp Conducted in Bodhanelli Village
డాక్టర్ నగేష్ ఆధ్వర్యంలో బోధనెల్లి గ్రామంలో వైద్య శిబిరం
నేటిదాత్రి చర్ల
చర్ల మండలంలోని సత్యనారాయణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల బోధనెల్లి గ్రామంలో డాక్టర్ నగేష్ ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది ఈ
గ్రామంలోని ఇంటింటికి రాపిడ్ ఫీవర్ సర్వే చేస్తూ డ్రై డే కార్యక్రమాలు చేయించడం జరిగింది
జ్వరాలు వస్తే ఆశ్రద్ధ చెయ్యకుండా పి హెచ్ సి రావలెను మరియు అన్ని పరీక్షలు కూడా అందుబాటులో ఉన్నాయి అని గ్రామంలోని ప్రజలకు తెలియజేశారు
అలాగే వర్షాకాలం కాబట్టి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని
నీళ్లు నిల్వలేకుండా చూసుకోవలని
దోమ తెరలను వినియోగించుకోవాలని
ఎల్లపుడు పరిశుభ్రమైన నీటిని తీసుకోవాలని అన్నారు
గర్భిణి స్త్రీలను పరీక్షించి అవసరమైన పరీక్షలు చేశారు
ముగ్గురికి జ్వరం ఉన్నది వారికి ఆర్డిటీ మలేరియా పరీక్షలు చెయ్యడం జరిగింది వారికి మలేరియా లేదని వారికి మాములు జ్వరంగా నిర్దారించి మందులు ఇవ్వడం జరిగింది
మరియు 32 మందికి సాధారణ వ్యాధులకు మందులు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో
హెచ్ ఈ ఓ బాబురావు
ఎం ఎల్ హెచ్ పి సంధ్య
ఏఎన్ఎమ్ కవిత
హెల్త్ అసిస్టెంట్ వరప్రసాద్
ఆశా కార్యకర్తలు
తదితరులు పాల్గోన్నారు