
Telangana Essay Contest – 1 Lakh Prize
రాష్ట్రస్థాయి వ్యాసరచన పోటీలు..
లక్ష రూపాయల బహుమతి అవకాశం
– జిల్లా కన్వినర్ మేడికాల అంజయ్య
చందుర్తి, నేటిధాత్రి:
రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ, తెలంగాణ (ఎస్ ఏల్ టీ ఏ -టి ఎస్) ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నట్లు, రాజన్న సిరిసిల్ల జిల్లా కన్వీనర్ లు మేడికాల అంజయ్య, రాచర్ల వేణుమాధవ్, సత్య ప్రవీణ్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకే ఈ అవకాశం ఉందన్నారు. 6వ తరగతి నుండి పదవ తరగతి వరకు చదివే విద్యార్థులు, రాష్ట్ర స్థాయి కమిటీ నిర్ణయించిన తెలంగాణ కవులైన 11మంది గురించి వ్యాసం రాయాలన్నారు. ఆ కవులు, 1)బమ్మెర పోతన ,2)దాశరధి కృష్ణమాచార్య ,3)సుద్దాల హనుమంతు, 4)వట్టి కోట ఆళ్వార్ స్వామి, 5)వానమామలై వరదాచార్యులు, 6)సురవరం ప్రతాపరెడ్డి, 7)సామల సదాశివ, 8)బోయ జంగయ్య, 9)పాకాల యశోద రెడ్డి, 10)కాళోజీ నారాయణరావు, 11)డాక్టర్ సి.నారాయణరెడ్డి
పాఠశాల స్థాయిలో పై కవుల గురించి వ్యాసరచన పోటీ పెట్టి ప్రతి పాఠశాల నుంచి ఒక అమ్మాయి ఒక అబ్బాయి రాసిన రెండు వ్యాసాలను జిల్లా స్థాయి పోటీలకు పంపించవలసి ఉంటుందని వారు తెలిపారు. అలా జిల్లా స్థాయిలో ప్రత్యక్ష పోటీకి ఎంపికై వచ్చిన 50 వ్యాసాల నుండి 5 గురుని ఎంపిక చేసి రాష్ట్రస్థాయికి పంపించనున్నట్లు అంజయ్య తెలిపారు.
రాష్ట్ర స్థాయిలోనూ, జిల్లా స్థాయిలోనూ గెలిచిన విద్యార్థులందరికీ లక్ష రూపాయలను బహుమతులుగా పంచనున్నట్లు నిర్వాహకులు నిర్ణయించినట్లు, వారు తెలిపారు. జిల్లా స్థాయికి ప్రతి పాఠశాల నుంచి రెండు వ్యాసాలు పంపించాలన్నారు. వీటికి చివరి తేదీ అక్టోబర్ ఆరు గా నిర్ణయించారు. జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు అందరిని ఈ వ్యాసరచన పోటీలలో పాల్గొనేటట్లు చేసి, ప్రతి పాఠశాల నుంచి రెండు వ్యాసాలను పంపించేలా తెలుగు ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని, ఇందుకుగాను గూగుల్ ఫాం నింపాలన్నారు.విద్యార్థులు రాసిన తెలంగాణ కవుల ఔన్నత్యాన్ని చాటి చెప్పేలా ఉన్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మేడికాల అంజయ్య, వేణుమాధవ్, సత్య ప్రవీణ్ పిలుపునిచ్చారు.పూర్తి వివరాలకు 9441544727,9440491439 నెంబర్ల ను సంప్రదించాలన్నారు.