
BJP Marks Modi Birthday with Service
మోడీ జన్మదినం..
రోగులకు పండ్లు దుప్పట్లు పంపిణీ
నిజాంపేట: నేటి ధాత్రి
భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకొని బుధవారం బిజెపి నాయకులు రోగులకు పండ్లు, దుప్పట్లు పంపిణీ చేశారు. నిజాంపేట మండలం లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో బిజెపి మండలాధ్యక్షుడు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో రోగులకు పండ్లు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశ ప్రజల సంక్షేమం కోసం ఎల్లవేళలా సేవ చేస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోడీకి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో బిజెపి జిల్లా మోర్ఛ ప్రధాన కార్యదర్శి ఆకుల రమేష్, సిద్దు రెడ్డి, భాజా అంజయ్య, శ్రీనివాస్, అభిషేక్ రెడ్డి తదితర బిజెపి నాయకులు ఉన్నారు.