
"BRS Ex-MLA Peddy Exposes ₹1100 Crore Grain Scam"
కక్కించే వరకు పోరాటం ఆగదు”
మాజీ ఎమ్మెల్యే బి.ఆర్.ఎస్ సీనియర్ నాయకులు “పెద్ది సుదర్శన్ రెడ్డి”
ధాన్యం టెండర్ల కుంభకోణంపై బీఆర్ఎస్ విజయం!
కాంగ్రెస్ తొలి స్కాం బహిర్గతం చేసిన మాజీ ఎమ్మెల్యే “పెద్ది సుదర్శన్ రెడ్డి”
రూ.1100 కోట్ల కుంభకోణాన్ని బయటపెట్టిన బీఆర్ఎస్.
హైకోర్టులో PIL, కేంద్ర సంస్థలకు 755 పేజీల ఫిర్యాదు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు ఎత్తేయడంతో GO MS No.15 విడుదల.
కేవలం ₹65.9 కోట్లు జప్తు – పాక్షిక చర్యపై బీఆర్ఎస్ ఆగ్రహం.
“నేటిధాత్రి”,హైదరాబాద్, సెప్టెంబర్ 17:
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత జరిగిన మొదటి అవినీతి స్కాం పై బీఆర్ఎస్ పార్టీ పోరాటం ఫలితాలిస్తోందని, రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. గత ప్రభుత్వం కొనుగోలు చేసిన 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని, కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గ్లోబల్ టెండర్ల ముసుగులో బినామీల చేతి ద్వారా కొనుగోలు చేసి రూ.1100 కోట్ల కుంభకోణం చేసినట్టు బీఆర్ఎస్ ఆరోపించింది.
“పెద్ది” 20 నెలల పోరాట ఫలితం.
మాజీ ఎమ్మెల్యే, సివిల్ సప్లై మాజీ చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ గత 20 నెలలుగా నిరంతర పోరాటం చేస్తూ, ఈ స్కాంపై హైకోర్టులో PIL (34/2024) దాఖలు చేసింది. చీఫ్ జస్టిస్ ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే కౌంటర్ దాఖలు చేయాలంటూ 20 నెలల క్రితమే నోటీసులు ఇచ్చింది.
కానీ ప్రభుత్వం 18 సార్లు వాయిదాలు కోరడం వల్ల కేసులో ఆలస్యం జరిగినట్టు సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఇది తాము సేకరించిన ఆధారాలు గంభీరంగా ఉన్నాయని, కేసును ఎదుర్కొనలేని పరిస్థితిలో కాంగ్రెస్ ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
కేంద్ర సంస్థలకు 755 పేజీల రిపోర్టుతో “పెద్ది” ఫిర్యాదు.
బీఆర్ఎస్ అధ్వర్యంలో ED, CBI, సెంట్రల్ విజిలెన్స్, ACB, రాష్ట్ర విజిలెన్స్ లకు మొత్తం 755 పేజీల ఆధారాలతో కూడిన ఫిర్యాదు సమర్పించిందని చెప్పారు. ఈ స్కాంలో పాల్లెవేళుగు మిల్లర్లు, టెండర్ ఏజెన్సీలు, అధికారుల మధ్య తీవ్ర అడ్డగోలుగా అక్రమాలు జరిగాయని ఆరోపించారు.
430 కోట్ల స్కామ్ – కేవలం ₹65.9 కోట్లు జప్తు
ఈ స్కాంలో టెండర్ విలువ కంటే అదనంగా మిల్లర్ల నుంచి టెండర్ ఏజెన్సీలు వసూలు చేసిన మొత్తం రూ.430 కోట్లు. కానీ ప్రభుత్వం జారీ చేసిన GO MS No.15 ప్రకారం కేవలం ₹65.90 కోట్లే జప్తు చేశారు. టెండర్ ఏజెన్సీలైన కేంద్రియ బండార్, LACOF సంస్థల నుంచే జప్తు చేయడం జరిగిందని, హిందూస్తాన్ లిమిటెడ్, మంచుకొండ ఏజెన్సీలపై మాత్రం ఏ చర్యలు లేకపోవడం వెనుక ప్రైవేట్ ప్రమేయమే ఉందని ఆరోపించారు.
పాక్షిక చర్యలు – పక్కదారి చర్యలు!
సామాన్యంగా ఏ టెండర్ ఏజెన్సీ నిబంధనలు ఉల్లంఘించినా EMD మొత్తాన్ని పూర్తిగా జప్తు చేయడం ఆనవాయితీగా ఉంటే, ఈ కేసులో మాత్రం పాక్షికంగా జప్తు చేయడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా వసూలు చేసిన డబ్బుపై కృతజ్ఞత చూపించినట్లే అవుతుందన్నారు.
కక్కించేవరకు పోరాటం ఆగదు ప్రభుత్వానికి “పెద్ది” హెచ్చరిక
కాంగ్రెస్ పెద్దలు తిన్న ప్రతి రూపాయిని ప్రజల ముందు కక్కించేవరకు పోరాటం ఆగదు. ఇందులో పాలుపంచుకున్న అధికారులపై కూడా చర్యలు తప్పవు. సివిల్ సప్లై వ్యవస్థను ప్రైవేట్ ఎజెన్సీల చేతుల్లోకి అప్పగించిన దారుణాన్ని బహిర్గతం చేస్తామని పెద్ది సుదర్శన్ అన్నారు.