
"National Integration Day: Gandra’s Call for New Struggle"
జాతీయ సమైక్యత దినోత్సవ మాజీ ఎమ్మెల్యే గండ్ర
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు కటకం జనార్దన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిధిగా పాల్గొన్ని జాతీయ జెండా ఎగురవేసి,జాతీయ గీతాన్ని ఆలపించిన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.
జాతీయ సమైక్యత దినోత్సవాన్ని పురష్కరించుకుని యావత్ ప్రజానీకానికి శుభాకాంక్షలు తెలియచేస్తూ..
మనకు తెలిసిన చరిత్ర ప్రకారం 1947 ఆగష్టు 15వ తేదీన బ్రిటిష్ వారి చెర నుండి అనేక ఉద్యమాలు చేసి భారతదేశానికి స్వాతంత్య్రం సాధించుకున్నాం.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికి మన ప్రాంతానికి 13 నెలల తరువాత స్వాతంత్ర్యం వచ్చింది.
అఖండ భారతం కావాలనే ఉదేశ్యంతో ఆనాడు ప్రజలు నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి అసువులు బాసిన వారేందరో మన ప్రాంతం నుండి ఉన్నారు.
పరకాలలో రెండవ జలియన్ వాలా బాగ్ గా పేరుగాంచిన సంఘటన జరిగింది.
మరీ ఆనాడు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ ప్రాంతానికి వస్తున్న సందర్భంగా ప్రజలు తండోప తండాలుగా బయలుదేరి వస్తున్న వారిని విచక్షణా రహితంగా కాల్చి చంపడం జరిగింది.
నీళ్ళు, నిధులు,నియామకాలు మనవి మనకే కావాలని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమాలు చేసి ఆంధ్రపాలకుల చేర నుండి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుని 10 ఏండ్ల పరిపాలన లో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో పురోగతిని సాధించుకున్నాం.
మనందరం కూడా మరొక్క ఉద్యమానికి ఈరోజు మనం పునఃరంకితం కావాల్సిన అవసరం ఉంది.
ఎందుకంటే కేసీఆర్ అంత గొప్పగా తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మాణం చేస్తే, ఈనాటి పాలకులు ఏ రకంగా వంచిస్తున్నారో చూస్తున్నాం, మరి ఆనాడు ఏ రకంగా వ్యవసాయ రంగానికి సంబంధించినట్టు వంటి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి,24 గంటల కరెంటు ఇచ్చి, రైతుబంధు ఇచ్చి,మరి ప్రతి గింజ కూడా కొనుగోలు చేసి, రుణమాఫీ చేసి గొప్పగా చేస్తే ఈనాటి ప్రభుత్వం చేసే పనులు చెప్పుకోడానికి చాలా సిగ్గు అనిపిస్తుంది.
జాబ్ క్యాలెండర్ ఓపెన్ చేసి అందులో కనీసం ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా, బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలకు సర్టిఫికెట్స్ ఇచ్చి మేము ఉద్యోగాలు ఇచ్చాము అని సిగ్గులేకుండా చెప్పుకుంటున్నారు అని ఏద్దేవా చేశారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు, పట్టణ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.