
Alumni Reunion at ZPHS Digwal
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
జహీరాబాద్ నేటి ధాత్రి:
కోహీర్ లోని జడ్. పి. హెచ్. ఎస్ దిగ్వాల్ పాఠశాలలో 2001-02 బ్యాచ్ పూర్వ విద్యార్థులు తమ 23వ ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తరగతి ఉపాధ్యాయులు రామ్మూర్తి, ధర్మయ్య, శ్రీనివాస్, యాదగిరి, సతీష్ లు పాల్గొని విద్యార్థులకు విలువైన సలహాలు, సూచనలు అందించారు. తెలుగు ఉపాధ్యాయులు శ్రీనివాస్ పద్యాలతో కూడిన ప్రత్యేక పాటతో విద్యార్థులను అలరించారు. మల్లేశ్వరి, సుమిత్ర, శివకుమార్, సురేందర్, సత్యనారాయణ తమ చదువుకున్న రోజులను గుర్తుచేసుకుంటూ, ఉపాధ్యాయుల పట్ల తమ అనుభూతులను పంచుకున్నారు.