
Balanagar Flyover
చినుకు పడితే నర(డ)క ప్రాయమే…
హైడ్రా ఆర్.&బి. అధికారులకు పిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదు
ప్రమాదాలు జరిగి, ప్రాణాలు పోతేనే పట్టించుకుంటారేమో??
ఫ్లై ఓవర్ బ్రిడ్జి రోడ్డు బాగు చేయాలని బాలానగర్ వాసుల వినతి
హైదరాబాద్, నేటిధాత్రి:
హైదరాబాద్ లోని బాలానగర్ వార్డు పరిధిలోని ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద గత కొన్ని రోజులుగా గుంతలు ఏర్పడి వాహనదారులకి ఇబ్బందులుగా మారాయి.వర్షం కురిస్తే చాలు ఇక్కడ గుంతల్లో నీరు నిలిచి వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత కొన్ని రోజులుగా ఉన్న ఈ గుంతలు చూసి స్థానికులు మన్సూర్ ఎమర్జెన్సీ బాధ్యతలు తీసుకున్న హైడ్రా సిబ్బంది కి కూడా తెలియజేస్తే వారు ఆర్ అండ్ బీ కి సంబందించిన పని కాబట్టి వాళ్ళకి ఫిర్యాదు చేయాలని తప్పించుకుంటున్నారు.

అటు ఆర్ అండ్ బి అధికారులకు విన్నవిస్తే అది హైడ్రా కంట్రోల్లో ఉంది అందుకే మేము అక్కడ ఏ పని చేయలేవు అని ఆర్.&బి అధికారులు చేతులెత్తేస్తున్నారు. ఇలా ఇరు శాఖలు ఒకరిపై ఒకరు నెపం పెట్టుకొని తప్పించుకుంటున్నాయి తప్ప ప్రజల సేఫ్టీ కోసం ఏ శాఖ కూడా ఆలోచన చేయడం లేదు. స్థానిక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ప్రమాదాలు జరగకముందే గుంతలు పూడ్చి ప్రజలకు రక్షణ కల్పించాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదా అని స్థానికులు వాపోతున్నారు.

ఇప్పటికైనా అధికారులు మేల్కొని రోడ్డు పైన గుంతలు పునరావృత్తం కాకుండా నాణ్యమైన మెటీరియల్ తో పూడ్చి ఏ ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు..