
Man dies after going to graze cattle
పశువుల మేతకు వెళ్ళి వ్యక్తి మృతి..
• రెస్క్యూ టీం గాలింపులో శవం లభ్యం.
నిజాంపేట: నేటి ధాత్రి
పశువుల మేతకు వెళ్లి ప్రమాదవశత్తు చెరువులో పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన నిజాంపేట మండలంలో జరిగింది. నార్లపూర్ గ్రామానికి చెందిన బదన కంటి మహేష్ (25) అను వ్యక్తి శుక్రవారం మధ్యాహ్నం సుమారు 3 గంటల నుండి కనిపించక పోవడంతో పోలీసులకు సమాచారం అందించినట్లు గ్రామస్తులు తెలిపారు.

సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ రాజేష్ గ్రామంలో గల హైదర్ చెరువులో రిస్క్యూమ్స్ తో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ గాలింపులో శనివారం సుమారు 12 గంటలకు మహేష్ శవం లభ్యమయింది. పశువుల మేతకు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.